https://oktelugu.com/

Allu Arjun: ఆ బిరుదు కోసం బన్నీ చాలా మారాడు !

Allu Arjun: ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఈ మధ్య తన రూట్ మార్చాడు. ముఖ్యంగా ప్రభాస్ ను బ్లైండ్ గా ఫాలో అవుతున్నాడు. పాన్ ఇండియా సినిమాలను తలకెత్తుకుని ఆ ఇమేజ్ ను మెయింటైన్ చేస్తూ తనన తాను పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. పైగా తనకు అన్ని ఇండస్ట్రీల నుంచి సపోర్ట్ చేసేలా పావులు కదుపుతున్నాడు. నిజానికి పుష్ప సినిమా పై హిందీ హీరోలు, తమిళ హీరోలు.. చివరకు కన్నడ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 13, 2022 / 11:43 AM IST
    Follow us on

    Allu Arjun: ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఈ మధ్య తన రూట్ మార్చాడు. ముఖ్యంగా ప్రభాస్ ను బ్లైండ్ గా ఫాలో అవుతున్నాడు. పాన్ ఇండియా సినిమాలను తలకెత్తుకుని ఆ ఇమేజ్ ను మెయింటైన్ చేస్తూ తనన తాను పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. పైగా తనకు అన్ని ఇండస్ట్రీల నుంచి సపోర్ట్ చేసేలా పావులు కదుపుతున్నాడు. నిజానికి పుష్ప సినిమా పై హిందీ హీరోలు, తమిళ హీరోలు.. చివరకు కన్నడ హీరోలు కూడా తెగ పాజిటివ్ కామెంట్స్ చేశారు.

    Allu Arjun

    బన్నీ వాళ్ళ చేత చేయించే ప్రాగ్రాం పెట్టాడని టాక్ ఉంది. అయినా అందర్నీ కలుపుకోవడం అనే కాన్సెప్ట్ ను బన్నీ బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు. తోటి స్టార్ హీరోలతో మంచి అనుబంధం మెయింటైన్ చేస్తూ తనకు ఎవరూ శత్రువులు లేకుండా చూసుకోవడంలో బన్నీ సక్సెస్ అయ్యాడు. నిజానికి ఈ విషయంలో ఎన్టీఆర్ కాస్త ముందు ఉన్నాడు. ఒకప్పుడు తారక్ అనగానే యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోయేవాళ్లు.

    Also Read: ‘పుష్ప’ను వెంటాడిన ‘సాహో’ సెంటిమెంట్… ఇది గమనించారా?

    మీమ్స్ అంటూ ట్రోలింగ్ అంటూ బాగా హడావిడి చేసేవాళ్ళు. కానీ, ఇప్పుడు తారక్ కి యాంటీ ఫ్యాన్స్ లేరు. మహేష్ తో స్నేహం, చరణ్ తో బంధం, అటు ప్రభాస్ తో సైతం పలకరింపులు, ఇటు బన్నీతో సైతం బావ అంటూ సాన్నిహిత్యం మొత్తానికి ఎన్టీఆర్ తనదైన శైలిలో తనకు అందరూ కావాల్సిన వారే అంటూ ఫ్యాన్స్ లో కూడా పాజిటివ్ యాంగిల్ ను పంపాడు.

    అయితే, తెలుగులో ఎన్టీఆర్ చేసిన పనిని బన్నీ పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నాడు. అందరికీ టచ్ లోకి వెళ్లి పుష్ప పై పాజిటివ్ కామెంట్స్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. పైగా అఖండ ఆడియో లాంచ్ కి కూడా బన్నీ వచ్చాడు. ‘అఖండ’ ఈవెంట్ లో జై బాలయ్య అంటూ బన్నీ హడావుడి కూడా చేశాడు. కానీ గతంలో పవర్ స్టార్ అనడానికి కూడా బన్నీ ఇష్టపడలేదు.

    ఇప్పుడు జై పవర్ స్టార్ అనడానికి కూడా బన్నీ ఆసక్తిగా ఉన్నాడు అనుకోండి. మొత్తమ్మీద పాన్ ఇండియా స్టార్ అనే బిరుదు కోసం బన్నీ చాలా మారాడు. ఇంకా మారేలా ఉన్నాడు.

    Also Read: ‘పుష్ప’తో బన్నీ కల నెరవేరినట్లేనా?

    Tags