Kingdom pre-release talk: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ప్రస్తుతం తన ఆశలన్నీ ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం పైనే పెట్టుకున్నాడు. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్(Sitara Entertainments) బ్యానర్ పై నాగవంశీ(Nagavamsi) అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని చాలా రోజులైన ఈ చిత్రం ఇప్పటికే ఈ ఏడాది లో రెండు సార్లు వాయిదా పడింది. ముందుగా మే 28 న విడుదల చెయ్యాలని అనుకున్నారు, కానీ కుదర్లేదు. ఆ తర్వాత జూన్ 4 న విడుదల చేద్దాం అనుకున్నారు, అప్పటికి కూడా వర్క్ పూర్తి కాకపోవడం తో ఇక చివరికి జులై 31న విడుదల చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలైన వారం రోజులకే ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతుండడం చర్చనీయాంశం అయ్యింది.
Also Read: కన్నప్ప’ విషయంలో అక్షయ్ కుమార్ ఇంత మోసం చేశాడా..? వెలుగులోకి వచ్చిన నిజాలు!
మొన్న కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన ప్రోమో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి పాటకు రెస్పాన్స్ అంతంత మాత్రం గానే వచ్చింది. ఈరోజు సాయంత్రం రెండవ పాట ‘అన్న అంటేనే’ ప్రోమో ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ ప్రోమో టైటిల్ ని చూడగానే మన అందరికీ అర్థం అయ్యే విషయం ఏమిటంటే ఈ చిత్రం అన్నదమ్ముల సెంటిమెంట్ మీద తెరకెక్కించారని. ఈ సాంగ్ ప్రోమో ప్రకటన చేసే వరకు కూడా సినిమాలో ఇలాంటి ఎమోషన్ ఉంటుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. మరి విజయ్ దేవరకొండ కి అన్నగా నటించింది ఎవరు? అనే సందేహం మీకు రావొచ్చు. ఆయన మరెవరో కాదు,యంగ్ హీరో సత్యదేవ్. ఈ చిత్రం లో ఆయన స్పెషల్ క్యారక్టర్ చేసాడని రీసెంట్ గానే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏ క్యారక్టర్ చేసి ఉండుంటాడు?, కచ్చితంగా నెగటివ్ క్యారక్టర్ చేసి ఉంటాడని అనుకున్నారు, కానీ ఆయన హీరో కి అన్నయ్య పాత్రలో నటించాడు.
Also Read: ‘కన్నప్ప’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్..ఆల్ టైం డబుల్ డిజాస్టర్!
తన అన్నయ్య ని అన్యాయంగా హతమార్చిన దుర్మగులను వేటాడే పాత్రలో ఇందులో హీరో కనిపిస్తాడని, సినిమా సెకండ్ హాఫ్ లో చాలా మంచి ఎమోషన్ ఉంటుందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే సినిమా కంటెంట్ ఎలా ఉన్నా, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తన అద్భుతమైన ట్యూన్స్ తో ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తూ ఉంటాడు. ఈ చిత్రానికి కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడనుకుంటే మొదటి పాట ఆయన మార్కులో లేకపోవడం తో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. కానీ త్వరలో విడుదల చేయబోయే ‘అన్న అంటేనే’ లిరికల్ వీడియో సాంగ్ మాత్రం సినిమా థీమ్ ని తెలిపే విధంగా ఉంటుందని, కచ్చితంగా కొన్నేళ్ల పాటు ఈ పాట అన్ని ప్లాట్ ఫార్మ్స్ లో బలంగా వినిపిస్తోందని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.