Ravi Teja Favorite Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రవితేజ (Raviteja)…కెరియర్ మొదట్లో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేసిన రవితేజ ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు. ఇక మొత్తానికైతే పూరి జగన్నాథ్ ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లాంటి సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక అప్పటి నుంచి వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయనకున్న మార్కెట్ ను పదిలంగా ఉంచుకోవడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మినిమం గ్యారంటీ హీరోగా మారాడు. ఇక స్టార్ డైరెక్టర్లందరు రవితేజతో సినిమా చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న వారే కావడం విశేషం…ఇక రవితేజ తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాల్లో తనకు నచ్చిన సినిమాల్లో ఏంటి అని అడగగా అతనికి విక్రమార్కుడు (Vikramarkudu) మూవీ అంటే అతని కి చాలా ఇష్టమట… అందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. అందువల్లే అతను ఆ సినిమాకి అంత బాగా కనెక్ట్ అయ్యారట. ముఖ్యంగా అత్తిలి సత్తిబాబు క్యారెక్టర్ అల్లరి చిల్లరగా ఉంటుంది. కానీ విక్రమ్ సింగ్ రాథోడ్(Vikram Singh Rathodu) క్యారెక్టర్ చాలా సిన్సియర్ గా ఉండడమే కాకుండా డీసెంట్ గా ఉంటూ చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటాడు.
Also Read: హరిహర వీరమల్లు ఇంటర్వెల్ ఎపిసోడ్ లో భారీ ట్విస్ట్ ఉంటుందా..?
అందుకే ఆయకి ఆ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టమట. ఇక ఈ సినిమా తర్వాత ఇడియట్(Idoit ) సినిమా అంటే అతనికి చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేశాడు. పూరి జగన్నాధ్ తనను హీరోగా మార్చినప్పటికి ఇడియట్ సినిమా అతన్ని స్టార్ హీరోగా మార్చిందని రవితేజ పలు సందర్భాల్లో తెలియజేశాడు.
ఇక ఆయన చేసిన సినిమాల్లో క్రాక్ సినిమా అంటే కూడా అతనికి చాలా ఇష్టమని చెప్పాడు. మరి మొత్తానికైతే తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాల్లో ఈ మూడు సినిమాలు అంటే అతనికి చాలా ఇష్టమని చెప్పాడు. ఇక ఈ మూడు సినిమాలైతే చూపెట్టు సక్సెస్ ని సాధించాయని ఆయన చెబుతుండటం విశేషం…
ఇక వీటితోపాటు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, నేనింతే లాంటి సినిమాలు కూడా అతనిలో ఉన్న ఎమోషన్ ని బయటకు తీశాయని చెప్పాడు. మొత్తానికైతే ఆయన చేసిన చాలా సినిమాలు ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే రవితేజ యాక్టింగ్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. సగటు ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. అందువల్లే ఆయన సినిమాలు మినిమం గ్యారంటీగా ఆడడమే కాకుండా ఆయన సినిమా ఫ్లాప్ అయిన కూడా సగటు ప్రేక్షకులు ఒక్కసారి అయిన ఈ సినిమాను చూడాలని ఉత్సాహపడుతూ ఉంటారు…