Pawan Kalyan new movie update: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి ఈమధ్య కాలం లో ఎప్పుడూ లేని విధంగా ఈసారి రెండు నెలల గ్యాప్ లో రెండు భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అందులో ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంటే, ఓజీ(They Call Him OG) చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాలలో ‘ఓజీ’ కి ఫ్యాన్స్ లోనే కాదు, మామూలు ఆడియన్స్ లో కూడా వేరే లెవెల్ క్రేజ్ ఉంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆగష్టు నెల నుండి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వరుసగా రానున్నాయి. కానీ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ఓజీ సినిమాకు ఉన్న క్రేజ్ లో పావు శాతం కూడా లేకపోవడం గమనార్హం.
Also Read: అందం లో మహేష్ బాబు తో పోటీపడే హీరో తెలుగులో ఒకరున్నారు…కానీ సక్సెస్ లు మాత్రం లేవు…
రెండు నెలల్లో విడుదల కాబోతున్న ‘ఓజీ’ కి అన్ని ప్రాంతాల్లో ఫ్యాన్సీ రేట్స్ కి ప్రీ రిలీజ్ బిజినెస్ రూపం లో అమ్ముడుపోతే, మరో పది రోజుల్లో విడుదల కాబోతున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ఇంకా పూర్తి స్థాయిలో బిజినెస్ క్లోజ్ అవ్వకపోవడాన్ని చూసి రెండు సినిమాల మధ్య ఇంత వ్యత్యాసమా అని అభిమానులు సైతం ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడింది. నిజానికి చెప్పాలంటే ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి అయ్యినంత బడ్జెట్ లో ‘ఓజీ’ చిత్రానికి సగం కూడా అయ్యుండదు, పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం పడినంత కష్టం ఏ సినిమాకు కూడా పడలేదు. అలాంటి చిత్రాన్ని మళ్ళీ ఆయన భవిష్యత్తులో చెయ్యాలన్నా కూడా చెయ్యలేడు. కానీ ఈ సినిమా మాత్రం ఓజీ స్థాయిలో ఆడియన్స్ లో ఆసక్తి ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం.
Also Read: కింగ్ డమ్ సినిమా విజయ్ కెరియర్ ను డిసైడ్ చేస్తుందా..?
ఈ చిత్రం 2020వ సంవత్సరం లో మొదలైంది. డైరెక్టర్ క్రిష్ కేవలం 80 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చెయ్యాలని అనుకున్నాడు. కానీ మధ్యలో కరోనా రావడం, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కూడా తీవ్ర స్థాయిలో క్షీణించడం కారణంగా ఏడాది వరకు సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులు షూటింగ్ చేశారు,మళ్ళీ ఆపేసారు. అలా ఎదో కారణం చేత వాయిదా పడుతూ రావడంతో ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నాడు. ఇక్కడి నుండే ఈ సినిమాకు బ్యాడ్ టైం మొదలైంది. అభిమానులు కూడా ఈ సినిమా విజయం సాధిస్తుందనే ఆశల్ని వదులుకున్నారు. అంతే కాకుండా మేకర్స్ సరిగా ప్రొమోషన్స్ చేయకపోవడం, రెండు నెలల్లోనే ఓజీ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ విడుదల అవుతుండడం వంటివి అభిమానులను ఎక్కువగా ఓజీ పైనే ద్రుష్టి సారించేలా చేశాయి కానీ,’హరి హర వీరమల్లు’ ని పట్టించుకోవడం మానేశారు. అయితే రీసెంట్ గానే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎవ్వరూ ఊహించని రీతిలో సెన్సార్ నుండి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా విడుదల తర్వాత ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజమో తెలియాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.