Ramayana Movie: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రామాయణ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఓవరాల్ వరల్డ్ వైడ్ జీ చిత్రానికి అన్ని ప్రాంతీయ బాషకాలకు కలిపి 1110 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి మరో 539 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టాల్సి ఉంటుంది. ఈ వీకెండ్ తో ఆ మార్కుని కూడా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ చిత్రం ఇప్పటి వరకు 63 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ తో 80 నుండి 90 కోట్ల మధ్యలో గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని. ఫుల్ రన్ లో జైలర్ 2 తెలుగు రాష్ట్రాల గ్రాస్ ని కూడా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.
ఇక ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వచ్చినటువంటి వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 497 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక నుండి 106 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తమిళనాడు నుండి 33 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ రాగా, కేరళ నుండి 32 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో అయితే 9 రోజుల్లో ఈ చిత్రానికి 378 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో ‘ధురంధర్ 2’ ఓవర్సీస్ గ్రాస్ ని ఈ చిత్రం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫుల్ రన్ లో ఓవరాల్ గా ‘బాహుబలి 2’ గ్రాస్ ని అధిగమించే అవకాశాలు కూడా ఉన్నాయి.