Ramayan vs Adipurush: రామాయణం(Ramayan) సబ్జెక్టు మీద ఇది వరకు ఎన్నో సినిమాలు,సీరియల్స్ వచ్చాయి. కానీ అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ఈ కాలం లో , ఒక విజువల్ వండర్ గా రామాయణం ని ఎవ్వరూ చూపించలేకపోయారు. ప్రభాస్(Rebel Star Prabhas) ‘ఆదిపురుష్'(Adipurush) చిత్రం పై అంచనాలు భారీగా ఉండేవి. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ ఎప్పుడైతే బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి(Nitish Tiwari) (దంగల్ ఫేమ్) రామాయణం సిరీస్ ని తెరకెక్కించబోతున్నాను అనే అధికారిక ప్రకటన చేసాడో, అప్పటి నుండి ఆడియన్స్ లో కనీసం ఇప్పటికైనా ఒక పర్ఫెక్ట్ గ్రాండియర్ వర్క్ తో రామాయణం వస్తుందని ఆశపడ్డారు. రీసెంట్ గానే మొదటి భాగం టాకీ పార్ట్ ని పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా ప్రేక్షకుల కోసం మూవీ టీం ఒక గ్లింప్స్ వీడియో ని నేడు విడుదల చేసింది.
Also Read: రామాయణ గ్లింప్స్ ఎలా ఉందంటే
ఈ వీడియో కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుందని చెప్పారు, మరికొంత మంది మాత్రం చాలా యావరేజ్ గా ఉంది, VFX వర్క్ బాలేదని అన్నారు. మరి కొంత మంది అయితే ఇదేంటి ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీజర్ కంటే వరస్ట్ గా ఉంది. అదే చాలా బెటర్ కదా అని అంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ‘బ్రహ్మాస్త్ర’ మూవీ షాట్స్ ని తీసుకొచ్చి ఇందులో పెట్టి ‘రామాయణ్’ అని అంటారేంటి అంటూ వెక్కిరిస్తున్నారు. వాళ్ళ ట్రోల్స్ కాసేపు పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన VFX వర్క్ ఇంకా మొదలు కాలేదు అని స్పష్టంగా ఈ గ్లింప్స్ వీడియో ని చూస్తే అర్థం అవుతుంది. కేవలం సినిమా ఎలా ఉండబోతుంది అనే గ్లింప్స్ మాత్రమే చూపించారు. ‘ఆదిపురుష్’ చిత్రానికి, ఈ చిత్రానికి మధ్య ఉన్న పోలికలు ఏంటో ఒకసారి స్పష్టంగా చూద్దాము.
‘ఆదిపురుష్’ చిత్రం డైరెక్టర్ ఓం రౌత్ పురాణాలను నిక్కచ్చిగా అనుసరించకుండా, తనకు ఏది అనిపిస్తే అది తీసుకుంటూ వెళ్ళాడు. రామ, రావణుల లుక్స్ ని చాలా చీప్ గా చూపించారు. కానీ ఇక్కడ మాత్రం డైరెక్టర్ పురాణాలను తూచా తప్పకుండా అనుసరించినట్టు తెలుస్తుంది. శ్రీ రాముడిగా రణబీర్ కపూర్(Ranbir Kapoor) అద్భుతంగా సెట్ అయ్యాడు. అదే విధంగా రావణుడిగా కన్నడ సూపర్ స్టార్ యాష్(Rocking Star Yash) కూడా అదిరిపోయాడు. ఓవరాల్ గా చూస్తుంటే మనం ఊహించినట్టుగానే ఈ ఈ సినిమాని చాలా భారీ గా, అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కించే లాగానే ఉన్నారు మేకర్స్. మొత్తం మూడు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. రామాయణం లో ఎన్నో అద్భుతమైన ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని వెండితెర పై పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చెయ్యగలిగితే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలే జరుగుతాయి. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది.