Tollywood Heroes Remuneration: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మంచి సినిమాలను చేయడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ఇప్పటికే ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. తెలుగులో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇండియన్ ఇండస్ట్రీలో ఎవ్వరికి చెల్లించినటువంటి రెమ్యునరేషన్ ను మన స్టార్ హీరోలు తీసుకుంటున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మనవాళ్ళకి ఉన్న క్రేజీ ని వాడుకుంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలుగా ఎదిగారు. దానికి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి స్టార్ హీరో ఒక సినిమాకి దాదాపు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas )సైతం 200 కోట్ల రెమ్యూనరేషన్ ను ఛార్జ్ చేస్తుండడం విశేషం…ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటులు 180 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట… మహేష్ బాబు పవన్ కళ్యాణ్ లాంటి నటులు ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా బాటపడుతున్నారు. కాబట్టి వాళ్లు కొంచెం తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నారు. ఇక వాళ్లు కూడా భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవాలని చూస్తున్నారు. ఇక సీనియర్ హీరోల విషయానికొస్తే బాలయ్య బాబు దాదాపు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూన్నాడు. వెంకటేష్ సైతం 30 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. నాగార్జున సినిమాను బట్టి అందులో పర్సంటేజ్ ని తీసుకుంటున్నాడు.
అలాగే చిరంజీవి అయితే 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి…ఇక ఏది ఏమైనా కూడా ఇండియాలో మోస్ట్ వాల్యుబుల్ హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది మన తెలుగు హీరోలనే చెప్పాలి.
మనవాళ్లు సాధిస్తున్న సక్సెస్ లు ఆ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి వాళ్లు అంత మొత్తంలో పారితోషికం ఛార్జ్ చేస్తున్నారని సినిమా పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక మనవాళ్ళ ముందు మిగతా ఇండస్ట్రీ హీరోలు తేలిపోతున్నారు.
మన హీరోలు డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి స్టార్ ప్రొడ్యూసర్లు ముందుకు రావడమే కాకుండా మన హీరోలు చేస్తున్న సినిమాలు సక్సెస్ ని సాధించి భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టినప్పుడు అందులో ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయనే ఉద్దేశ్యంతోనే ప్రొడ్యూసర్లు మన స్టార్ హీరోల సినిమాలను భారీ ఎత్తున ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే మన హీరోలు వాళ్ళ క్రేజ్ విస్తరింప చేసుకుంటూ మంచి సక్సెస్ లను సాధిస్తుండడం విశేషం…