Ramarao On Duty Review: నటీనటులు: రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి తదితరులు.
దర్శకుడు: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సంగీత దర్శకుడు: సామ్ సి.ఎస్.
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్.

మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. నేడు రిలీజ్ అయిన ఈ సీరియస్ యాక్షన్ డ్రామా ఎలా ఉందో రివ్యూ చూద్దాం
కథ :
రామారావు (రవి తేజ్) ఒక సిన్సియర్ ఆఫీసర్. న్యాయ్యవస్థ కంటే న్యాయం ముఖ్యం అని నమ్మే ఒక సబ్ కలెక్టర్. పైగా డ్యూటీ కోసం భారీ ఫైట్స్ చేసే వెరీ పవర్ ఫుల్ ఆఫీసర్ కూడా. అలాగే మరోవైపు తన భార్య నందిని (దివ్యాంశ కౌశిక్)తో ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటాడు. మరో పక్క న్యాయం కోసం సిస్టమ్ కి వ్యతరేకంగా డ్యూటీ చేస్తుంటాడు. ఈ క్రమంలో సబ్ కలెక్టర్ నుంచి చిత్తూరు జిల్లాకు ఎమ్మార్వో గా రావాల్సి వస్తోంది. అయితే అప్పటికే అక్కడ యస్ ఐగా మురళి (వేణు తొట్టెంపూడి) ఉంటాడు. అతను నిర్లక్ష్యంగా పని చేస్తుంటాడు. అంతలో రామారావు మాజీ లవర్ మాలిని (రజిషా విజయన్) భర్త మిస్ అవుతాడు. అతని వెతికే క్రమంలో రామారావుకి మెయిన్ విలన్ గురించి తెలుస్తోంది. ఇంతకీ ఎవరు అతను ?, చివరకు రామారావు అతన్ని పట్టుకున్నాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
దర్శకుడు శరత్ మండవ ఎమోషనల్ స్టోరీ లైన్ రాసుకున్నప్పటికీ సినిమాలో ఎక్కడా ప్లో లేదు. దీనికితోడు సినిమా ప్రారంభంలోనే అనవసరంగా మాస్ ఎలిమెంట్స్ చూపించి.. సినిమా మూడ్ ను చెడగొట్టాడు.
అసలు రవితేజ లాంటి హీరోను పెట్టుకుని ఇలాంటి సిల్లీ డ్రామాను రాసుకోవడంలోనే శరత్ ఫెయిల్ అయ్యాడు. అయినా కథలోకి తీసుకెళ్లెందుకు మంచి సీన్స్ చూపించాలి. కానీ శరత్ మాత్రం అనవసరమైన ట్రాక్స్ చూపిస్తూ పోయాడు.
ఇక రవితేజ – రజిషా విజయన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా బాగాలేదు. అయితే ఇంటర్వెల్ యాక్షన్ అండ్
ఎమోషన్ తో కథ ఊపందుకుంది అనుకుంటే.. అనవసరమైన సీన్స్ తో మళ్ళీ సినిమాని బోరింగ్ ప్లే సాగదీశారు. పైగా దివ్యాంశ కౌశిక్ తో సాగిన సీన్స్ లో ఎక్కడా ఫీల్ లేదు. అలాగే ఎమోషన్ కూడా లేదు. కానీ, వేణు తొట్టెంపూడి క్యారెక్టర్ మాత్రం బాగుంది. వేణు కూడా అద్భుతంగా నటించాడు. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో రవితేజ – వేణు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో చాలా సహజంగా నటించారు.
ప్లస్ పాయింట్స్ :
రవితేజ – వేణు నటన,
ఎమోషనల్ సీన్స్,
సినిమాలో మెయిన్ పాయింట్,
మైనస్ పాయింట్స్ :
ఓవర్ బిల్డప్ సీన్స్,
కథాకథనాలు ఆసక్తికరంగా సాగకపోవడం,
రెగ్యులర్ స్టోరీ,
బోరింగ్ స్క్రీన్ ప్లే,
సినిమా చూడాలా ? వద్దా ?
ఎర్రచందనం నేపథ్యంలో జరుగుతున్న అగాత్యలను ఎలివెట్ చేస్తూ భిన్నమైన యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ రామారావు ఆన్ డ్యూటీ బాగాలేదు. నాసిరకమైన సీన్స్ తో సినిమా బోర్ కొడుతుంది. అయితే, కొన్ని ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీన్స్ పర్వాలేదు. ఓవరాల్ గా రామారావు మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచాడు.
రేటింగ్ : 2 / 5 ,
Also Read: BJP Secret Surveys: బీజేపీ రహస్య సర్వేల వెనుక అసలు కారణాలేంటి?
Recommended Videos