Daggubati Ramanaidu: ఆ అనుభవంతోనే ఎన్నో అపజయాలను తప్పించారు

Daggubati Ramanaidu, Alexander Movie: సుమన్ పై అనేక ఆరోపణలు వస్తోన్న రోజులు అవి. ఈ నేపథ్యంలో మొదలైన సినిమా ‘అలెగ్జాండర్‌’ (Alexander Telugu Movie). ఐతే, ఈ సినిమా నిర్మాత సత్యనారాయణలో ఆందోళన రోజురోజుకు ఎక్కువైపోతూ ఉంది. ‘చిత్రాన్ని అయితే తెరకెక్కించాం, మరీ విడుదల పరిస్థితి ఏమిటి ?’ అని ఆయనలో ఎక్కడో భయం పట్టుకుంది. ఎలాగోలా సినిమాని పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించారు సత్యనారాయణ. కానీ బయ్యర్లు నుండి ఒక పెద్ద సమస్య […]

Written By: admin, Updated On : August 21, 2021 6:47 pm
Follow us on

Daggubati Ramanaidu, Alexander Movie: సుమన్ పై అనేక ఆరోపణలు వస్తోన్న రోజులు అవి. ఈ నేపథ్యంలో మొదలైన సినిమా ‘అలెగ్జాండర్‌’ (Alexander Telugu Movie). ఐతే, ఈ సినిమా నిర్మాత సత్యనారాయణలో ఆందోళన రోజురోజుకు ఎక్కువైపోతూ ఉంది. ‘చిత్రాన్ని అయితే తెరకెక్కించాం, మరీ విడుదల పరిస్థితి ఏమిటి ?’ అని ఆయనలో ఎక్కడో భయం పట్టుకుంది. ఎలాగోలా సినిమాని పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించారు సత్యనారాయణ. కానీ బయ్యర్లు నుండి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది.

సినిమా బాగా రాలేదు, అలాగే హీరో మీద ఏవేవో ఆరోపణలు వస్తున్నాయి, మేము రిలీజ్ చేయలేం అంటూ వాళ్ళు తప్పుకున్నారు. ఆ రోజుల్లో సినిమా విడుదల అనేది డిస్ట్రిబ్యూటర్స్ చేతిలోనే ఎక్కువ ఉండేది. నిర్మాత కేవలం సినిమా వారికీ చూపించడం వరకే పరిమితం అయ్యేవాడు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి ? ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలి లాంటి అంశాలు అన్నీ డిస్ట్రిబ్యూటర్స్ చూసుకునేవారు.

అలాంటి వాళ్ళు ‘అలెగ్జాండర్‌’ పక్కన పెట్టేశారు. నిర్మాత సత్యనారాయణకి ఏమి చేయాలో పాలుపోలేదు. ఈ సమస్య నుండి తనను బయట పడేసే ఏకైక వ్యక్తి రామానాయుడు (Dr. Daggubati Ramanaidu) ఒక్కడే అని ఎవరో చెప్పిన మాట ఆయనకు గుర్తుకు వచ్చింది. సినిమా విడుదల తేదీ ఎల్లుండి అనగా, రామానాయుడుగారు దగ్గరకు వెళ్లి జరిగిన విషయం వివరంగా చెప్పారు నిర్మాత సత్యనారాయణ.

వాస్తవానికి ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ పక్కన పెట్టిన సినిమా జోలికి ఎవరు పోయేవారు కాదు. కానీ, నిర్మాత కష్టాలు తెలిసిన వాడిగా రామానాయుడుగారు స్పందించారు. తన స్టూడియోలో అలెగ్జాండర్‌ సినిమాని వేయించుకుని చూశారు. సినిమా చూసిన రామానాయుడుగారు సినిమాలో కొన్ని సన్నివేశాలు అటు ఇటు మార్చాల్సి ఉంటుంది అని సలహాలు సూచనలు చేశారు.

పైగా ఆ సినిమా దర్శకుడు రంగారావును పిలిపించి ‘అలెగ్జాండర్‌’ సినిమాలో దగ్గర ఉండి మార్పులు చేయించారు. ముఖ్యంగా ఐదారు సన్నివేశాల విషయంలో రామానాయుడుగారు పూర్తిగా మార్చారు. అన్ని మార్పులు పూర్తి అయ్యాక, సినిమాను మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ చూపించారు.

వాళ్ళు చూసి, సంతోషంగా సినిమాని అనుకున్న తేదీకే రిలీజ్ చేయడానికి అంగీకరించారు. ఒక సినిమా విషయంలో రామానాయుడుగారు అనుభవం అంత గొప్పగా పని చేసేది. ఆ అనుభవంతోనే ఆయన ఎన్నో సినిమాలను అపజయాల నుండి తప్పించారు.