పైకి శాంతిమంత్రం జపిస్తూ వెనుకాల మాత్రం తాలిబన్లు క్రూరత్వం ప్రదర్శిస్తున్నారు. తాలిబన్ల అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. ఎదురు తిరిగిన వారిపై కాల్పులు జరుపుతున్నారు. తమకు వ్యతిరేకంగా ప్రభుత్వంతో కలిసి పనిచేసిన వారిని వేటాడుతున్నారు. తాలిబన్ల అరాచకాలు తట్టుకోలేక అప్ఘాన్ ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
కాబూల్ ను వశపరుచుకొని దేశాన్ని ఆక్రమించిన తాలిబన్లు విధ్వంసాలకు దిగుతున్నారు. రోడ్డెక్కిన వారిపై కాల్పులు చితకబాదడాలు చేస్తున్నారు. మహిళల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి వీడియోలు వెలుతుండడంతో ఇప్పుడు వాడకుండా కూడా తాలిబన్లు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. తాలిబన్ల రాకతో ఆహార ధరలకు రెక్కలు వచ్చాయి. ఏదీ కొనుగోలు చేసే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఆహారం రుచిగా వండలేదనే కారణంతో ఓ మహిళకు తాలిబన్లు నిప్పంటించారని తెలిసింది. యువతులతో బలవంతంగా తాలిబన్లకు పెళ్లిళ్లు చేస్తున్నారట.. మహిళలను శవపేటికల్లో బంధించి ఇతర దేశాలకు తరలించి సెక్స్ బానిసలుగా మారుస్తున్నారని తెలిసింది.
అప్ఘన్ పూజారులపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారని అమ్మెస్టీ సంస్థ తెలిపింది. ఘజ్నీ ప్రావిన్సులో తొమ్మిది మంది పూజారులను చిత్రహింసలు చేసి తాలిబన్లు దారుణంగా హత్య చేసినట్లు సమాచారం. కొందరు పోలీసులు, పాత్రికేకయ సిబ్బంది సైతం తాలిబన్ల చేతిలో చనిపోయారని.. వ్యతిరేకంగా పనిచేసిన వారందరినీ ఇంటింటికి తిరిగి మరీ తాలిబన్లు చంపుతున్న పరిస్థితి నెలకొంది.
అధికారం చేపట్టాక ప్రజలకు క్షమాభిక్ష ప్రకటిస్తామని.. మహిళా హక్కులు గౌరవిస్తామని.. ప్రతీకార దాడులు చేయబోమన్న తాలిబన్ల ప్రకటన ఒట్టి నీటి మూట అని తేలిపోయింది. వాస్తవ పరిస్థితులు దేశంలో దారుణంగా ఉన్నాయి. విమానాశ్రయం లోపల అమెరికన్ సైనికులు ఉండగా.. చుట్టూ తాలిబన్లు పహారా కాస్తున్నారు. విమానాశ్రయం ఎక్కేందుకు ప్రయత్నించిన 12మందిని కాల్చి చంపారు. వారు రోజుల్లో అమెరికా సైన్యం పర్యవేక్షణలో ఉన్న కాబూల్ నుంచి 12 వేల మంది విదేశీయులు , దౌత్య అధికారులను తరలించారు. ఇక అప్ఘాన్ లో చిక్కుకున్న అమెరికన్లు సహా ఇన్నాళ్లు తమకు సాయం చేసిన అప్ఘన్ వాసులను ఖచ్చితంగా అమెరికా తరలిస్తామని జోబైడెన్ హామీ ఇచ్చారు.
ఇక కాబూల్ విమానాశ్రయంలో ఉన్న 6వేల మంది అమెరికా బలగాలకు ఎలాంటి అంతరాయం కలిగించవద్దని తాలిబన్లను అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. ప్రస్తుతం సైనిక, రవాణా, చార్టెడ్ విమానాలకు అమెరికన్, నాటో దళాలు రక్షణ కల్పిస్తున్నాయి. పౌరులను తరలిస్తున్నాయి. అమెరికా కోసం పనిచేసిన వారు ఇప్పుడు విమానాశ్రయానికి రావడానికి తాలిబన్లను తప్పించుకోవడానికి ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.