Rama Banam Twitter Talk: హీరో గోపీచంద్ కి అర్జెంటుగా హిట్టు కావాలి. ఆయన వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. దర్శకుడు శ్రీవాస్, హీరోయిన్ డింపుల్ హయాతీ పరిస్థితి కూడా ఇదే. దీంతో రామబాణం మూవీ మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. మరి వీరి ఆశలు ఫలించాయా? హిట్టు దక్కిందా?.. ప్రేక్షకుల అభిప్రాయం ఏమిటో చూద్దాం. మే 5న రామబాణం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలైంది. యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శన ముగిసింది. ఆడియన్స్ సినిమా ఎలా ఉందో తెలియజేస్తున్నారు.
రామబాణం మూవీ కథ చెప్పాలంటే… జగపతిబాబుది ఒక అందమైన ఉమ్మడి కుటుంబం. సాంప్రదాయాలు, విలువలతో బ్రతికే కుటుంబ సభ్యులు. సమాజ హితం కోరుతూ తమ చుట్టూ ఉన్నవాళ్లు కూడా అలానే బ్రతకాలని ఆశిస్తారు. ఆనందంగా జీవిస్తున్న ఈ కుటుంబాన్ని ఒకడు ఇబ్బందులకు గురి చేస్తాడు. వాడి ఆట కట్టించేందుకు హీరో రంగంలోకి దిగుతాడు. మొత్తంగా రామబాణం చిత్ర కథ ఇదే. చెప్పాలంటే ఒకప్పటి హిట్ ఫార్ములా. ఈ తరహా చిత్రాలు పదుల సంఖ్యలో రాగా ఈ జనరేషన్ ఆడియన్స్ కనెక్ట్ కావడం లేదు.
శ్రీవాస్ డెబ్యూ మూవీ లక్ష్యం కథ ఇంచుమించు ఇలానే ఉంటుంది. విలన్ హీరో అన్నయ్యను చంపి ఆ ఫ్యామిలీకి తీరవని వేదన మిగుల్చుతాడు. హీరో గోపీచంద్ విలన్ మీద పగ తీర్చుకుంటాడు. ఒకప్పటి హిట్ ఫార్ములాను నమ్ముకొని రామబాణం తెరకెక్కించిన శ్రీవాస్ మరలా దెబ్భైపోయాడు అంటున్నారు. రామబాణం చిత్రానికి నెగిటివ్ రివ్యూలు పడుతున్నాయి. అవుట్ డేటెడ్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అంటున్నారు. పాట, ఫైటు, కామెడీ, ఎమోషన్… అప్పుడప్పుడు హీరోయిన్ తో రొమాన్స్ అన్నట్లు రామబాణం తెరకెక్కిందని ప్రేక్షకుల అభిప్రాయం.
ఫస్త్ హాఫ్ అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, గెటప్ శ్రీనులతో కూడిన కామెడీ సన్నివేశాలు, డింపుల్ హయాతీతో రొమాంటిక్ సన్నివేశాలతో నడిపించేశారట. కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఒకటి రెండు సన్నివేశాలు తప్పితే అవి కూడా విసిగించాయని అంటున్నారు. కనీస ఆసక్తి రేపని కథనం నెక్స్ట్ సీన్ ఏమిటో అర్థమయ్యేలా సాగిందంటున్నారు. గోపీచంద్ యాక్షన్ సీన్స్, అక్కడక్కడా నవ్వించే కామెడీ, హీరోయిన్ గ్లామర్ మినహాయించి చెప్పుకోవడానికి ఏమీ లేదంటున్నారు. ట్విట్టర్ టాక్ చూస్తే గోపీచంద్ కి మరలా నిరాశ తప్పేలా లేదు. సినిమా పూర్తి ఫలితం తెలియాలంటే వీకెండ్ వరకు వేచి చూడాలి.
#RamaBanam Overall A Completely Outdated Commercial Entertainer that is predictable to the core!
A few comedy scenes are ok and a few songs are decent but other than that nothing worth mentioning. Reminds us of films in the last decade. Hard to sit through.
Rating: 1.75-2/5
— Venky Reviews (@venkyreviews) May 5, 2023
#Ramabanam
Chala rojulu taruwata manchi commercial movie choostuna first half done comedy timing super— TharunDhfmb (@Tharundhfmb3) May 5, 2023