Rama Banam Collections: గోపీచంద్ ‘రామబాణం’ 6 రోజుల వసూళ్లు.. ఇది మామూలు డిజాస్టర్ కాదండి బాబోయ్!

ఆరు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడం తో ఓపెనింగ్స్ కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 15 కోట్ల రూపాయలకు పైమాటే, థియేటర్స్ నుండి 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడితే కానీ యావరేజి గ్రాసర్ గా నిలవదు, అయితే ఈ చిత్రం ఆరు రోజులకు కలిపి ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

Written By: Vicky, Updated On : May 11, 2023 8:13 am

Rama Banam Collections

Follow us on

Rama Banam Collections: పాపం ఈమధ్య మ్యాచో స్టార్ గోపీచంద్ కి టైం అసలు కలిసి రావడం లేదు. బాగున్న సినిమాలు ఆడడం లేదు, బాగాలేని సినిమాలకు అయితే కనీసం నాలుగు కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేకపోతున్నాయి. అయితే తనకి లక్ష్యం మరియు లౌక్యం వంటి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన శ్రీవాస్ ని గుడ్డిగా నమ్మి, నాసిరకపు స్టోరీ ని ఎంచుకొని ‘రామబాణం’ అనే సినిమా తీసాడు.

ఆరు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడం తో ఓపెనింగ్స్ కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 15 కోట్ల రూపాయలకు పైమాటే, థియేటర్స్ నుండి 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడితే కానీ యావరేజి గ్రాసర్ గా నిలవదు, అయితే ఈ చిత్రం ఆరు రోజులకు కలిపి ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి కేవలం మూడు కోట్ల 33 లక్షల రూపాయిలు మాత్రమేనట. గోపీచంద్ కి ఉన్న మాస్ ఇమేజి కి సరైన సినిమా పడితే, కేవలం నైజం ప్రాంతం మొదటి రోజు వసూళ్లు ఈ రేంజ్ లో ఉండేవి.

కానీ ఫుల్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా అంత వసూళ్లు రావడాన్ని చూస్తుంటే గోపీచంద్ మార్కెట్ ఏ రేంజ్ లో డౌన్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఆడియన్స్ ఆయన సినిమాలను చూడడం మెల్లగా మానేస్తునట్టు అర్థం అవుతుంది. స్టార్ హీరో అవ్వడానికి అన్నీ రకాలుగా అర్హత ఉన్న గోపీచంద్ పరిస్థితి ఇలా అయ్యిపోవడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకున్నారు.గోపీచంద్ కి ఒక భారీ హిట్ ఇచ్చి మళ్ళీ ఆయనని బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసే డైరెక్టర్ ఎవరో చూడాలి.