https://oktelugu.com/

Virupaksha Collections: జోరు తగ్గని ‘విరూపాక్ష’ వసూళ్లు.. 50 కోట్ల రూపాయిల షేర్ కి అతి చేరువలో..!

ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రం 20 రోజులకు గాను 46 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిందట. గత వీకెండ్ లో విడుదలైన రెండు కొత్త సినిమాలకు ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన రావడం తో 'విరూపాక్ష' చిత్రానికి బాగా కలిసి వచ్చింది.కేవలం ఆదివారం రోజే ఈ చిత్రం 90 లక్షల రూపాయిల వరకు షేర్ ని రాబట్టింది అట.

Written By:
  • Vicky
  • , Updated On : May 11, 2023 / 08:17 AM IST

    Virupaksha Collections

    Follow us on

    Virupaksha Collections: సాయి ధరమ్ తేజ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘విరూపాక్ష’ ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద తన జోరుని కొనసాగిస్తూనే ఉంది. కొత్త సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి,కానీ ‘విరూపాక్ష’ చిత్రం మాత్రం తగ్గేదేలే అనే ధోరణి తో ముందుకు దూసుకుపోతుంది. కేవలం 24 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా ఎవ్వరూ ఊహించని రీతిలో వసూళ్లను సాధించి సాయి ధరమ్ తేజ్ మార్కెట్ ని రెండింతలు ఎక్కువ చేసింది.

    ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రం 20 రోజులకు గాను 46 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిందట. గత వీకెండ్ లో విడుదలైన రెండు కొత్త సినిమాలకు ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన రావడం తో ‘విరూపాక్ష’ చిత్రానికి బాగా కలిసి వచ్చింది.కేవలం ఆదివారం రోజే ఈ చిత్రం 90 లక్షల రూపాయిల వరకు షేర్ ని రాబట్టింది అట.

    అలాగే 19 వ రోజు 27 లక్షల రూపాయిల షేర్, 20 వ రోజు 19 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ వీకెండ్ ‘కస్టడీ’ చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచుకున్నప్పటికీ కూడా ‘విరూపాక్ష’ వసూళ్లపై ఎలాంటి ప్రభావం ఉండదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటి వరకు 46 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొతుందని అంటున్నారు, చూడాలి మరి.

    ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈ చిత్రాన్ని హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో గ్రాండ్ గా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకుఇ ఈ చిత్రానికి కేవలం 57 లక్షల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది, ప్రొమోషన్స్ అనుకున్న స్థాయిలో చెయ్యకపోవడం వల్లే ఇతర బాషలలో ఆశించిన ఫలితం రాలేదని అంటున్నారు.