రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.36,000 పొందే ఛాన్స్..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ద్వారా కేంద్రం దేశంలోని రైతులకు మూడు విడతల్లో 6 వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేస్తోంది. ఈ స్కీమ్ తో పాటు కేంద్రం రైతుల కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా […]

Written By: Navya, Updated On : January 13, 2021 4:57 pm
Follow us on

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ద్వారా కేంద్రం దేశంలోని రైతులకు మూడు విడతల్లో 6 వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేస్తోంది. ఈ స్కీమ్ తో పాటు కేంద్రం రైతుల కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా 60 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రైతులు ఈ స్కీమ్ లో చేరవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఫండ్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటూ ఉండగా రైతులకు ఈ స్కీమ్ ద్వారా భారీగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ స్కీమ్ లో చేరిన రైతులు వారి వయస్సును బట్టి 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ప్రతి నెలా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వయస్సును బట్టి ప్రీమియం చెల్లింపులో మార్పులు ఉంటాయి.

దేశంలోని 21 లక్షల మంది రైతులు ఇప్పటికే పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ లో చేరారు. ఈ స్కీమ్ కు అర్హులైన వారు వీలైనంత త్వరగా చేరితే తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. మన దేశంలోని రైతులు ఎవరైనా ఈ స్కీమ్ లో చేరవచ్చు. అయితే 5 ఎకరాల లోపు పొలం ఉంటే మాత్రమే ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలు పొందటానికి రైతులు అర్హులవుతారు.

ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పెన్షన్ పొందే అవకాశం ఉండటంతో రైతులు ఈ స్కీమ్ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. సమీపంలోని బ్యాంక్ లను, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బ్రాంచ్ లను సంప్రదించి ఈ స్కీమ్ లకు సంబంధించిన వివరాలను, చెల్లించాల్సిన ప్రీమియంకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.