https://oktelugu.com/

Ram Pothineni: ఇక మీదట క్లాస్ సినిమాలు చేయనున్న రామ్…కారణం ఏంటంటే..?

Ram Pothineni: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్న మహేష్ బాబు తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 13, 2024 / 06:01 PM IST

    Ram will be doing class movies from now on

    Follow us on

    Ram Pothineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ పోతినేని…ప్రస్తుతం రామ్ ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తున్న హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన ఒక క్లాస్ సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక అందులో భాగంగానే కొంతమంది దర్శకులతో చర్చలు నడుపుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక అందులో ముఖ్యంగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్న మహేష్ బాబు తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆయన ఇప్పటికే రామ్ ని కలిసి ఆయనకు స్క్రిప్ట్ ని కూడా నరేట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది ఇంకా క్లారిటీగా తెలియదు.

    Also Read: Pushpa 2: పుష్ప 2 కి పోటీగా దిగుతున్న రెండు సినిమాలు ఇవే…

    కానీ ఇదొక డీసెంట్ క్లాస్ సినిమాగా ముందుకు సాగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరో ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమాతో పాన్ ఇండియాలో క్రేజ్ ను కనక ఆయన సంపాదించుకున్నట్లైతే ఆయన నుంచి ఏ సినిమా వచ్చిన కూడా పాన్ ఇండియా రీచ్ అయితే దక్కుతుంది.

    Also Read: Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఏమైంది? ఆందోళన రేపుతున్న ఫోటో!

    కాబట్టి ఎలాగైనా సరే డబుల్ ఇస్మార్ట్ సినిమాతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రామ్ ఇంతకుముందు ఇలాంటి క్లాస్ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. అందుకే రామ్ మరోసారి క్లాస్ సినిమా చేసి సక్సెస్ బాట పట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి రామ్ కి క్లాస్ సినిమా కలిసి వస్తుందా లేదా మాస్ సినిమా అతన్ని స్టార్ హీరోగా నిలబెడుతుందా అనేది…