The Warrior: ఎనెర్జిటిక్ స్టార్ రామ్ హీరో గా నటించిన ‘ది వారియర్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళం బాషలలో సుమారు 1300 థియేటర్స్ లో ఘనంగా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ రావడం తో రామ్ అభిమానులు చాలా బాధపడ్డారు..ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతవరణం కూడా బాగాలేకపోవడం తో ఈ సినిమా ఓపెనింగ్స్ పై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంటుందేమో అని కంగారు పడ్డారు..కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా కి అద్భుతమైన ఓపెనింగ్ రావడం విశేషం..రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 7 కోట్ల రూపాయిల షేర్ ని సొంతం చేసుకుంది..మాములుగా అయితే విడుదలకి ముందు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ వీక్ గా ఉండడం తో మొదటి రోజు కేవలం నాలుగు కోట్ల రూపాయిలు మాత్రమే వసూలు చేస్తుందని అనుకున్నారు..కానీ అంచనాలకు మించి ఇంత వసూలు చెయ్యడం చూస్తుంటే రామ్ కి ఉన్న మాస్ ఇమేజి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ సినిమా OTT రైట్స్ ని డిస్నీ + హాట్ స్టార్ కొనుగోలు చేసినట్టు సమాచారం..క్రేజీ కాంబినేషన్ తో తెరకెక్కిన సినిమా కావడం తో ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని దాదాపుగా 15 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది..టయర్ 2 హీరో సినిమాకి ఇంత మొత్తం అంటే రికార్డు అనే చెప్పొచ్చు..అయితే లేటెస్ట్ గా విడుదలయ్యే సినిమాలన్నీ థియేటర్స్ లో విడుదలైన 50 రోజుల తర్వాతే OTT లో విడుదల చెయ్యాలనే సరికొత్త రూల్ పెట్టడం తో ఈ చిత్రం సెప్టెంబర్ 2 వ వారం లో టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది..OTT లవర్స్ ఈ సినిమా కోసం మరో 48 రోజులు వేచి చూడక తప్పదు.
Also Read: Ante Sundaraniki Movie: OTT లో రికార్డుల వర్షం కురిపిస్తున్న అంటే సుందరానికి చిత్రం

ఇక ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 45 కోట్ల రూపాయలకు జరిగినట్టు సమాచారం..వీకెండ్ మొత్తం మంచి ట్రెండ్ చూపించే ఛాన్స్ ఉండడం తో ఈ సినిమా మూడు రోజుల్లోనే పాతిక కోట్లకి పైగా షేర్ ని వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..సోమవారం నుండి డీసెంట్ హోల్డ్ సాధించగలిగితే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం కూడా పెద్ద కష్టం కాదని తెలుస్తుంది..మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందో లేదో చూడాలి.
Also Read:Balakrishna- NTR: బాలయ్య హీరో గా, యముడిగా ఎన్టీఆర్ తీయాలనుకున్న సినిమా చివరికి ఏమైందో తెలుసా?
[…] Also Read: The Warrior: రామ్ ‘ది వారియర్’ OTT రిలీజ్ డేట్ వ… […]