Ante Sundaraniki Movie: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన అంటే సుందరానికి సినిమా ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, వసూళ్లను రాబట్టడం లో మాత్రం టాక్ కి తగట్టు లేకపోవడం విశేషం..మాములుగా నాని ఈ జోనర్ లో నటించిన సినిమాలన్నీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..కానీ ఈ జోనర్ లో పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని కూడా ఫ్లాప్ రిసల్ట్ ని మూటగట్టుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది..ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, ఫుల్ రన్ లో కేవలం 22 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది..అయితే ఇటీవలే ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసారు..అందులో ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది.

ఈ నెల 8 వ తారీకు నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఆ రోజు నుండి ఈరోజు వరుకు నాన్ స్టాప్ గా టాప్ 1 స్థానం లో కొనసాగుతూనే ఉంది..కేవలం తెలుగు లో మాత్రమే కాదు..తమిళం మరియు మలయాళం లో కూడా ఈ సినిమా ని దబ్ చేసి నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ చేసారు..అవి కూడా టాప్ లోనే ట్రెండ్ అవుతున్నాయి..విశేషం ఏమిటి అంటే ఈ సినిమా విడుదల సమయం లో సోషల్ మీడియా లో ఒక సెలబ్రిటీ కూడా రెస్పాండ్ అవ్వలేదు..కానీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన తర్వాత సెలెబ్రిటీలు సైతం ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు.
Also Read: Balakrishna- NTR: బాలయ్య హీరో గా, యముడిగా ఎన్టీఆర్ తీయాలనుకున్న సినిమా చివరికి ఏమైందో తెలుసా?

అలా థియేటర్స్ లో మిశ్రమ స్పందన సంపాదించుకున్న ఈ సినిమా OTT లో మాత్రం దుమ్ము లేపుతూ సరికొత్త రికార్డ్స్ సృష్టించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం..దీనితో హీరో నాని కి మరియు ఆ చిత్ర దర్శక నిర్మాతలకి మంచి సంతోషాన్ని కలిగించింది ఈ చిత్రం..ప్రస్తుతం నాని దసరా అనే సినిమా లో హీరో గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..సరికొత్త మేకోవర్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం తో నాని భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని ఆయన అభిమానులు గట్టి నమ్మకం తో ఉన్నారు.
Also Read:Mahesh Babu- Trivikram: మహేష్ సినిమాలో మరో హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరింది
[…] Also Read: Ante Sundaraniki Movie: OTT లో రికార్డుల వర్షం కురిపిస… […]