Kajal Agarwal- koratala Siva: ఏ ముహూర్తం లో కొరటాల శివ ఆచార్య సినిమా ని మొదలుపెట్టాడో కానీ అప్పటి నుండి ఆయనకీ అన్ని కష్టాలే మొదలయ్యాయి..ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా ఇండస్ట్రీ లో టాప్ 2 డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగిన కొరటాల శివ..ఆచార్య సినిమా దెబ్బకి ఆస్తులను కూడా తాకట్టు పెట్టె రేంజ్ కి వచేసాడు..ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడం తో అభిమానులు ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు..ఆ అంచనాలను కాష్ చేసుకోవాలనే ఆలోచనతో కొరటాల శివ ఈ సినిమా రైట్స్ మొత్తాన్ని ఆ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి వద్ద 80 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూటర్స్ కి 135 కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు..కానీ మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ రావడం తో ఓపెనింగ్స్ ని కూడా దక్కించుకోలేకపోయింది ఈ సినిమా..మెగాస్టార్ నలభై ఏళ్ళ కెరీర్ లో ఓపెనింగ్స్ ని దక్కించుకొని సినిమా ఇదే కావడం విశేషం.

థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం 48 కోట్ల రూపాయిలు షేర్ మాత్రమే వసూలు చేసింది..దీనితో డిస్ట్రిబ్యూటర్స్ కి సుమారు 80 కోట్లకు పైగా నష్టాలు వాటిల్లింది..కనీసం మాకు 45 కోట్ల రూపాయిలు అయినా తిరిగి ఇవ్వాలని కొరటాల శివ ఆఫీస్ చుట్టూ డిస్ట్రిబ్యూటర్స్ ప్రదక్షిణాలు చెయ్యడం ప్రారంభించారు..నిన్న గాక మొన్న సీడెడ్ డిస్ట్రిబ్యూటర్స్ మాకు 20 కోట్ల రూపాయిలు నష్టపరిహారం ఇవ్వకపోతే ఇక్కడి నుండి కదలము అంటూ కొరటాల శివ ఆఫీస్ ముందు ధర్నాకి దిగిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వాళ్ళని ఇంటికి పిలిచి 20 కోట్ల రూపాయిలు చేతిలో పెట్టి పంపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఇలా తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులలో చిక్కుకున్న కొరటాల శివ కి ఇప్పుడు సాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసిన ఒక ప్రముఖ ఛానల్ మరో షాక్ ని ఇచ్చింది..సినిమాలో కాజల్ అగర్వాల్ సన్నివేశాలను తొలగించినందుకు గాను కొరటాల శివ కి ఇస్తామన్న డబ్బులతో రెండున్నర కోటి రూపాయిలు కట్ చేశారట.
Also Read: The Warrior: రామ్ ‘ది వారియర్’ OTT రిలీజ్ డేట్ వచ్చేసింది

అంతే కాకుండా ఈ సినిమాని అన్ని ప్రతియా బాషలలో డబ్ చేసి టెలికాస్ట్ చేయాలనుకున్నారు ముందు..కానీ ఇప్పుడు ఆ ఆలోచనని ఆ ఛానల్ వారు విరమించుకున్నట్టు తెలుస్తుంది..దీనితో మరో 5 కోట్ల రూపాయిలు కట్ చేసి ఇవ్వబోతున్నారట..మొత్తం మీద సాటిలైట్ రైట్స్ ముందు అనుకున్న దానికంటే 7 కోట్ల 50 లక్షల రూపాయిలు తగ్గించి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది..అసలే నష్టాల ఊబిలో చిక్కుకుపోయిన కొరటాల శివ కి బోనస్ గా ఈ షాక్ లు రావడం చూసి అందరూ ఆయనపై జాలి చూపిస్తున్నారు.
Also Read:Bill Gates: తన యావదాస్తిపై బిల్ గేట్స్ సంచలన నిర్ణయం