Ram Pothineni and Sai Dharam Tej : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమంది యంగ్ హీరోలకి మాత్రం చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్ళు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం రామ్ పోతినేని (Ram Pothineni) లాంటి యంగ్ హీరో వరుస సినిమాలను చేస్తూ మాస్ లో తనకు మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక సాయిధరమ్ తేజ్ లాంటి హీరో సైతం తనను తాను స్టార్ గా ఎలివేట్ చేసుకుంటూనే తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక వీళ్ళతో పాటు నితిన్ కూడా మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నప్పటికి ఇప్పుడు మాత్రం వరుసగా ఆరు డిజాస్టర్ లను మూటగట్టుకున్నాడు. మరి ఇకమీదట రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తేనే ఆయన కెరీర్ అనేది సాఫీగా సాగుతుంది. లేకపోతే మాత్రం ఆయన కెరియర్ కి భారీగా ప్రమాదమైతే ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఈ ముగ్గురు హీరోలు కూడా కెరియర్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉండటం వల్ల అనుకోకుండా వీళ్ళు పవన్ కళ్యాణ్ నటనని ఇమిటేట్ చేస్తూ సినిమాల్లో నటిస్తూ ఉంటారు. అందువల్లే వీళ్ళకి చాలా మంచి క్రేజ్ అయితే దక్కింది. ఇక వింటేజ్ పవన్ కళ్యాణ్ చాలా అద్భుతమైన నటన ప్రదర్శించేవాడు.
Also Read : రామ్ తో నిశ్చితార్థం పై స్పందించిన భాగ్యశ్రీ భోర్సే..లేటెస్ట్ పోస్ట్ వైరల్!
యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తూ ఆయన మేనరిజమ్స్ గాని ఆయన చెప్పే డైలాగులు గాని ప్రతి ఒక్కరిని ఆనందింపజేసేవి… మరి ఇలాంటి సందర్భంలో ఈ ముగ్గురు హీరోలు సైతం ఆయనను ఇమిటేట్ చేస్తూ కొన్ని సీన్లలో నటిస్తూ ఉండటం వల్ల వీళ్లకు కూడా మంచి క్రేజ్ అయితే దక్కింది…ఇక ఈ విషయాన్ని ఈ ముగ్గురు హీరోలు కూడా ఒకానొక సందర్భంలో తెలియచేశారు.
వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అంటూనే చిన్నప్పటి నుంచి అతను సినిమాలు చూస్తూ రావడం వల్ల అనుకోకుండా తమలో పవన్ కళ్యాణ్ ఇమిడిపోయాడని అందులో తాము ఎలాంటి యాక్టింగ్ చేసినా కూడా వాళ్లలో పవన్ కళ్యాణ్ తాలూకు షెడ్స్ కనిపిస్తూ ఉంటాయని ఈ ముగ్గురు హీరోలు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…
ఇక ప్రస్తుతం వీళ్ళ సినిమాలకు ప్రేక్షకుల్లో ఎలాంటి స్పందన వస్తుంది. రాబోయే సినిమాలతో మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోలుగా మారతారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read: అనారోగ్యం కారణంగానే విడాకులు..? సంచలనం రేపుతున్న సమంత రెస్పాన్స్!