Ram Pothineni: గత కొంతకాలం గా సోషల్ మీడియా లో హీరో రామ్ పోతినేని(Ram Pothineni), హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే(Bhagyasri Bhorse) మధ్య వస్తున్న కథనాలను మనమంతా గమనిస్తూనే ఉన్నాం. వీళ్లిద్దరు ప్రస్తుతం ప్రేమలో పడ్డారని, ఒకరిని ఒకరు ఘాడంగా ప్రేమించుకుంటున్నారని, ప్రస్తుతం వీళ్లిద్దరు ఒకే ఇంట్లో డేటింగ్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో రకరకాల కథనాలు ప్రచారం లో ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా భాగ్యశ్రీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు వీళ్లిద్దరు కలిసే ఉంటున్నారు అనడానికి సాక్ష్యాలు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే భాగ్యశ్రీ ఉంటున్న ఇంటికి సంబంధించిన గుర్తులు, గతంలో రామ్ అప్లోడ్ చేసిన ఫొటోలో ఉన్న ఇంటి గుర్తులకు మ్యాచ్ అయ్యాయని, అంటే వీళ్ళిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారు అంటూ వస్తున్న వార్తలు నిజమేనని సోషల్ మీడియా లో ప్రచారం సాగుతుంది.
Also Read: అనారోగ్యం కారణంగానే విడాకులు..? సంచలనం రేపుతున్న సమంత రెస్పాన్స్!
అంతే కాకుండా నిన్న అప్లోడ్ చేసిన ఫొటోలో భాగ్యశ్రీ చేతి వేళ్ళకు ఉంగరం ఉంది. ఆ ఉంగరాన్ని చూపిస్తున్నట్టుగానే ఆమె ఫోజు పెట్టింది. ఒక అభిమాని ‘నిశ్చితార్థం ఎప్పుడు చేసుకున్నావ్..ఆ ఉంగరం తొడిగిన అబ్బాయి ఎవరు?’ అని అడగ్గా, దానికి భాగ్యశ్రీ సమాధానం చెప్తూ ‘ఇది నాకు ఎవ్వరూ ఇవ్వలేదు, ఇది నేనే కొనుక్కున్నాను’ అంటూ కామెంట్ చేసింది. కేవలం ఇదొక్క కామెంట్ మాత్రమే కాదు, భాగ్యశ్రీ నిన్న పెట్టిన ఫోటో క్రింద కామెంట్ లో అధిక శాతం మంది అభిమానులు రామ్ తో డేటింగ్ చేస్తున్నావ్ అటగా?, నిజమేనా అని అడుగుతున్నారు. దీనికి భాగ్యశ్రీ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ వార్తలకు చెక్ పడేది ఎప్పుడంటే, ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి చేస్తున్న సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో పాల్గొన్నప్పుడు. ఆ సమయంలో కచ్చితంగా విలేఖరులు ఈ విషయం అడగకుండా ఉండరు, దానికి వీళ్ళిద్దరూ సమాధానం చెప్పక తప్పదు.
అప్పటి వరకు ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. ఇకపోతే వీళ్లిద్దరు కలిసి చేస్తున్న సినిమా విషయానికి వస్తే, అది దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యినట్టే అని అంటున్నారు. పి.మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటించబోతున్నాడు అట. ఒక వీరాభిమాని తన ఆరాధ్య దైవం లాంటి హీరో ని ఎక్కడో మారుమూల గ్రామం నుండి తన సైకిల్ మీద వెళ్లి కలుసుకునే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. కేవలం ఒక హీరోని కలవడం కోసం ఎందుకు ఇలా చేయడం?, ఏదైనా ముఖ్య కారణం ఉందా? వంటి అంశాలతో ఈ సినిమాని చాలా ఎమోషనల్ గా తెరకెక్కిస్తున్నారట. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ వస్తున్న రామ్, ఈ సినిమాతో కచ్చితంగా కం బ్యాక్ ఇస్తాడు అనే బలమైన నమ్మకంతో ఉన్నారు ఆయన అభిమానులు.