spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Pothineni marriage statement : పెళ్లి పై హీరో రామ్ సంచలన ప్రకటన.. ఇలాంటి...

Ram Pothineni marriage statement : పెళ్లి పై హీరో రామ్ సంచలన ప్రకటన.. ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడని ఊహించలేదు..

Ram Pothineni marriage statement : టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రభాస్(Rebel Star Prabhas) తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో ఉన్న హీరో రామ్ పోతినేని(Ram Pothineni). ఈయన పై సోషల్ మీడియా లో ఎన్నో రూమర్స్ వినిపించాయి. అప్పట్లో ప్రముఖ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో ప్రేమాయణం నడిపాడు అంటూ వార్తలు వచ్చాయి , ఇక రీసెంట్ గా అయితే యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే తో ప్రేమాయణం నడుపుతున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని రామ్ పలు మార్లు పలు ఇంటర్వ్యూస్ లో తెలిపాడు. కానీ అభిమానులు మాత్రం నమ్మడం లేదు. కచ్చితంగా భాగ్యశ్రీ తో ఎదో రిలేషన్ ఉందని బలంగా నమ్ముతున్నారు. అయితే రీసెంట్ గా ఆయన ప్రేమ , పెళ్లి గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఆయన మాట్లాడుతూ ‘నేను చిన్నప్పటి నుండి నా జీవితం లో ఒంటరిగా సమయాన్ని గడిపేందుకే ఇష్టపడతాను. నాకు కూడా అందరి లాగానే స్నేహితులతో కలిసి సినిమాలకు , షికార్లకు వెళ్లడం ఇష్టమే , కానీ ఒంటరిగా నాకు నేను కేటాయించుకునే సమయం లో వచ్చే కిక్ వేరు. సినీ ప్రపంచం లో ఉంటాను కాబట్టి , నా చుట్టును నిత్యం రద్దీ ఉండడం సహజం . కానీ అలాంటి సందర్భాల్లో కూడా నాకు నేను స్వయంగా ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నాను. రేపు నా జీవితం లోకి ఎవరైనా అమ్మాయి వస్తే, ఆమెతో నా సమయాన్ని పంచుకోవడానికి రెడీ. ఒకవేళ నా జీవితం లోకి ఎవ్వరూ రాకపోయినా పర్వాలేదు. ఒంటరిగానే బ్రతికేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ పోతినేని. ఇదేంటి రామ్ రేపో మాపో పప్పు అన్నం పెట్టే వార్త చెప్తాడు అనుకుంటే, ఒంటరిగా బ్రతికేస్తాను అంటున్నాడు , అంతటి వైరాగ్యం ఎందుకు అంటూ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

ఇక రామ్ కెరీర్ విషయానికి వస్తే, ఈమధ్య కాలం లో పాపం ఈయనకు ఏది కలిసి రావడం లేదు. చేస్తున్న ప్రతీ సినిమా ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగులుతున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకోవడంతో , రామ్ శకం మొదలైంది, ఇక వేరే లెవెల్ కి వెళ్ళిపోతాడని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన చేసిన రెడ్, ది వారియర్ , స్కంద, డబుల్ ఇస్మార్ట్ , ఆంధ్రా కింగ్ తాలూకా వంటి చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఈ ఫ్లాప్స్ కారణంగా రామ్ కెరీర్ పై బలమైన ప్రభావం పడింది. అందుకే ఈసారి స్వయంగా ఆయనే కథ రాసుకుంటున్నాడు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించే అవకాశం ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version