https://oktelugu.com/

Ram Pothineni: స్టార్ హీరోయిన్ ప్రేమలో హీరో రామ్… పెళ్లికి అంతా సిద్ధం!

మరో టాలీవుడ్ హీరో రామ్ పోతినేని సైతం ఓ స్టార్ హీరోయిన్ తో పెళ్ళికి సిద్దమయ్యారన్న న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ని ఆయన వివాహం చేసుకోబోతున్నారనేది లేటెస్ట్ టాక్.

Written By:
  • Shiva
  • , Updated On : October 4, 2023 / 10:03 AM IST

    Ram Pothineni

    Follow us on

    Ram Pothineni: హీరోయిన్స్ ని పెళ్లాడే సంప్రదాయం టాలీవుడ్ లో తక్కువే. నాగార్జున, నాగ చైతన్య, రాజశేఖర్, పవన్ కళ్యాణ్ ఇలా చాలా తక్కువ మంది తెలుగు హీరోలు హీరోయిన్స్ ని భార్యలుగా తెచ్చుకున్నారు. బాలీవుడ్ లో మాత్రం పదుల సంఖ్యలో ఉన్నారు. అక్కడ హీరోలు హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకోవడం ఆనవాయితీగా ఉంది. టాలీవుడ్ లో కూడా ఈ సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో పెళ్ళికి సిద్ధమయ్యారు. నిశ్చితార్థం కూడా జరిగింది. నవంబర్ లేదా డిసెంబర్ లో వివాహం జరిగే ఆస్కారం ఉంది.

    మరో టాలీవుడ్ హీరో రామ్ పోతినేని సైతం ఓ స్టార్ హీరోయిన్ తో పెళ్ళికి సిద్దమయ్యారన్న న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ని ఆయన వివాహం చేసుకోబోతున్నారనేది లేటెస్ట్ టాక్. ఓ మీడియా కథనం ప్రకారం రామ్ పోతినేని-అనుపమ కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నారట. ఇరు కుటుంబాల పెద్దలు కూడా వీరి ప్రేమను అంగీకరించారట. త్వరలో పెళ్లి ప్రకటన రానుందట. ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

    ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలో మొదటిసారి రామ్-అనుపమ కలిసి నటించారు. అనంతరం హలో గురూ ప్రేమ కోసమే చిత్రం చేశారు. ఈ చిత్రాల షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. ఇక రామ్ కెరీర్ పరిశీలిస్తే… ఏమంత ఆశాజనకంగా లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్కంద కూడా విజయం సాధించలేదు. స్కంద రూ. 15 నుండి 20 కోట్ల నష్టాలు మిగిల్చే సూచనలు కనిపిస్తున్నాయి.

    సెలవులు కలిసి రావడం వలన ఆ మాత్రపు వసూళ్లు దక్కాయి. ముందుగా అనుకున్నట్లు సెప్టెంబర్ 15న విడుదలైతే స్కంద భారీ నష్టాలకు దారి తీసేది. స్కంద ఫలితం నేపథ్యంలో స్కంద 2 ఉండకపోవచ్చు. బోయపాటి శ్రీను హీరో చిరంజీవితో ప్రాజెక్ట్ లాక్ చేశారని టాక్. ఇక రామ్ ఆశలన్నీ డబుల్ ఇస్మార్ట్ పైనే. దర్శకుడు పూరి జగన్నాథ్ త్వరితగతిన ఈ చిత్రం పూర్తి చేస్తున్నాడు. రామ్ కెరీర్లో క్లీన్ హిట్ గా ఇస్మార్ట్ శంకర్ ఉంది. మరలా రామ్ కి హిట్ పడలేదు.