Naga Chaitanya- Samantha
Naga Chaitanya- Samantha: హీరో నాగ చైతన్య వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా కొత్త అనుమానాలకు దారి తీసింది. సమంతతో ఆయన ఇంకా సంబంధాలు కొనసాగిస్తున్నాడా? అనే సందేహం కలుగుతుంది. 2018లో ప్రేమ వివాహం చేసుకున్న సమంత-చైతన్య రెండేళ్ల క్రితం విడిపోయారు. 2021లో పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల ప్రకటన అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మీడియా సమంతను కార్నర్ చేసింది.
సమంతకు ఎఫైర్స్ ఉన్నాయి. ఆమెకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు. కుటుంబ విలువలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు ఉంటుందంటూ పలు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. నిరాధార కథనాలపై సమంత మండిపడ్డారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద కేసు కూడా పెట్టారు. అదే సమయంలో నాగ చైతన్య మీద పరోక్షంగా, ప్రత్యక్షంగా తన అసహనం బయటపెట్టింది. నాగ చైతన్య సమంత కలవడం అసంభవం అనుకుంటుండగా ఓ వీడియో కొత్త చర్చకు దారి తీసింది.
ఇటీవల నాగ చైతన్య వద్ద పని చేసే యువకుడు బైక్ కొన్నాడు. అతని కోరిక మేరకు నాగ చైతన్య బైక్ మీద ఆటోగ్రాఫ్ చేశాడు. అలాగే రైడ్ చేస్తున్నట్లు ఫోటోలకు పోజిచ్చాడు. ఈ వీడియోలో సమంత పెట్ డాగ్ హ్యాష్ కనిపించింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. సమంత పెట్ డాగ్ నాగ చైతన్య దగ్గరకు ఎలా వచ్చింది. దీని వెనకున్న రీజన్ ఏంటి? సమంత-నాగ చైతన్య రహస్య సంబంధాలు కలిగి ఉన్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
హ్యాష్ సమంత-చైతూ కలిసి ఉన్నప్పటి నుండి ఉంది. ఆ డాగ్ తో నాగ చైతన్యకు కూడా అనుబంధం ఉంది. విడాకులు అనంతరం సమంత వద్దే హ్యాష్ ఉంటుంది. దానికి తోడుగా మరొక డాగ్ ని సమంత తెచ్చుకుంది. మరి సమంత వద్ద ఉండాల్సిన హ్యాష్ చైతు దగ్గరకు ఎలా వచ్చిందనేది ఆసక్తికర అంశం. బహుశా అప్పుడప్పుడు సమంత పనివాళ్ళు చైతు దగ్గరకు హ్యాష్ ని తీసుకొస్తూ ఉండొచ్చు. సమంత-నాగ చైతన్య కలవడం మాత్రం జరగని పని అని కొందరి అంచనా.
Pure soul !❤️✨ #NagaChaitanya pic.twitter.com/NU6LK4ui3e
— Karthikkk_7 (@Karthikuuu7) October 2, 2023