Ram Pothineni – Boyapati Srinu: రామ్ – బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా లవ్ స్టోరీనా.. ఇదెక్కడి ట్విస్ట్ సామీ!

గుబురు గడ్డంతో బాగా లావుగా రామ్ ఈ గ్లిమ్స్ వీడియో లో కనిపించాడు.శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు.ఈ ఏడాది అక్టోబర్ 20 వ తారీఖున దసరా సందర్భంగా చిత్రాన్ని విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరిగిపోతున్న నేపథ్యం లో ఆగస్టు నెలలోనే విడుదల చెయ్యాలని చూస్తున్నారు.

Written By: Vicky, Updated On : May 29, 2023 3:18 pm

Ram Pothineni - Boyapati Srinu

Follow us on

Ram Pothineni – Boyapati Srinu: 2021 డిసెంబర్ నెలలో నందమూరి బాలకృష్ణ తో ‘అఖండ’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్స్ ఆఫీస్ ని శాసించిన బోయపాటి శ్రీను ప్రస్తుతం యంగ్ అండ్ ఎనెర్జిటిక్ హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని రీసెంట్ గానే రామ్ పుట్టిన రోజు నాడు విడుదల చేసారు. దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది.

గుబురు గడ్డంతో బాగా లావుగా రామ్ ఈ గ్లిమ్స్ వీడియో లో కనిపించాడు.శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు.ఈ ఏడాది అక్టోబర్ 20 వ తారీఖున దసరా సందర్భంగా చిత్రాన్ని విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరిగిపోతున్న నేపథ్యం లో ఆగస్టు నెలలోనే విడుదల చెయ్యాలని చూస్తున్నారు.

ఇది ఇలా ఉండగా బోయపాటి శ్రీను సినిమా అంటేనే ఊర మాస్ ఎలిమెంట్స్ తో గూస్ బంప్స్ రప్పించే ఎలివేషన్ సన్నివేశాలతో మాస్ ఆడియన్స్ కి పిచ్చెక్కించే విధంగా ఉంటుంది. అయితే బాలయ్య తో కాకుండా యంగ్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు మాత్రం బోయపాటి శ్రీను మేకింగ్ స్టైల్ వేరే విధంగా ఉంటుంది. అల్లు అర్జున్ సరైనోడు చిత్రం ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా తీసి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

అదే తరహాలోనే ఇప్పుడు రామ్ తో కూడా చెయ్యబోతున్నాడు అట. ఇది పూర్తి స్థాయి మాస్ సినిమా అనుకుంటే పొరపాటే, ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ జానర్ లో నడిచే మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా అట. భద్ర తర్వాత బోయపాటి లవ్ జానర్ లో సినిమాలను తియ్యలేదు. ఎక్కువగా మాస్ సినిమాలవైపే ద్రుష్టి సారించాడు.ఇప్పుడు కాసేపు ఆటవిడుపు కోసం ఆయన లవ్ స్టోరీ చేస్తున్నాడని అంటున్నారు ట్రేడ్ పండితులు.