SS Rajamouli RRR Movie: “ఆర్ఆర్ఆర్” ఈ నెల 25వ తేదీన రాబోతుంది. బలమైన నేపథ్యం ఉన్న రెండు సినీ కుటుంబాల వారసులు కలిసి నటించిన సినిమా ఇది. పైగా ఇద్దరి హీరోలకూ భారీ మాస్ ఇమేజ్ ఉంది. అసలు ఇలాంటి ఇమేజ్ ఉన్న ఇద్దరు బడా స్టార్లను హ్యాండిల్ చేయడం, వారి మధ్య ఎలాంటి ఇగోలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవడం సామాన్యమైన విషయం కాదు.
కానీ, రాజమౌళి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని పూర్తి చేశాడు. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. తీరా సినిమా రిలీజ్ అయ్యే సమయంలో రాజమౌళికి టెన్షన్ స్టార్ట్ అయింది. ఇద్దరి హీరోల అభిమానుల యుద్ధం మొదలైంది. వారి మనోభావాలు హ్యాండిల్ చేయడం ఇప్పుడు జక్కన్నకి అతి పెద్ద తలనొప్పి అయ్యింది.
Also Read: మరో ‘షో’ మొదలు పెట్టబోతున్న సీనియర్ హీరోయిన్ !
మరోపక్క సినిమా రిలీజ్ కు టైం దగ్గర పడుతుంది. అందుకే.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్, తమ అభిమానాన్ని ప్రదర్శించేందుకు శక్తి వంచన లేకుండా పోటీ పడుతున్నారు. ఆ పోటీ ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్ మధ్య అగ్గిని రగిలించింది. యుఎస్ లో ‘తొక్కుకుంటూపోవాలే’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గాలిలో చేసిన విన్యాసాలు అద్భుతంగా పేలాయి.
ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఈ విన్యాసాలు బలంగా చూపించాయి. దాంతో చరణ్ ఫ్యాన్స్ ఇగో హర్ట్ అయ్యింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనగానే అందరికీ ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకు వస్తున్నాడు అని చరణ్ ఫ్యాన్స్ బాగా ఫీల్ అయ్యారు. చరణ్ ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. పైగా ‘వేటగాడు వచ్చేటంతవరకే’ అన్న డైలాగ్ తో ఒక హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ కు దిగారు.
మొత్తమ్మీద ఒక పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘తొక్కుకుంటూపోవాలే’ అంటుంటే.. చరణ్ ఫ్యాన్స్ మాత్రం ‘వేటగాడు వచ్చేటంతవరకే’ అంటూ హడావుడి చేస్తున్నారు. అయితే, ఈ పోటీ సినిమాకు మేలు చేస్తుందో లేదో తెలియదు గానీ, కీడు చేసే ప్రమాదం ఉంది. సినిమా రిలీజ్ అయ్యాక, చరణ్ సీన్స్ వరెస్ట్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ సీన్స్ వేస్ట్ అంటూ చరణ్ ఫ్యాన్స్ పోస్టులు పెట్టే ప్రమాదం ఉంది.
అప్పుడు అసలుకే మోసం వస్తోంది. అందుకే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ ఫ్యాన్స్ వార్ కు బ్రేకులు పడే విధంగా ఎన్టీఆర్ – చరణ్ కలిసి స్పీచ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్పీచ్ ను రాజమౌళినే ప్లాన్ చేశాడట. ఫ్యాన్స్ తమ హీరోని హైలైట్ చేయడానికి మరో హీరో సీన్స్ బాగాలేదు అంటారని రాజమౌళి భయపడుతున్నాడు. మరి ఆ భయం నిజం అవుతుందో లేదో చూడాలి.
Also Read: ‘వైల్డ్ ఫైట్స్ – యాక్షన్ ఎలిమెంట్స్’ మధ్యలో మెగా ప్రిన్స్