Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ నాగార్జునతో చేసిన శివ సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించింది అంటే అప్పటిదాకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి ఒక కథ రాలేదని అలాంటి మేకింగ్ తో దర్శకుడు సినిమా చేయలేదంటూ కొన్ని సంవత్సరాల పాటు శివ గురించి మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కూడా తెలుగు సినిమా టాపిక్ వచ్చిన ప్రతిసారి శివ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే వర్మ ఈ సినిమాని అంత బాగా తెరకెక్కించాడు. ఎక్కడ కూడా మైనస్ పాయింట్స్ లేకుండా సినిమాని కొత్తగా తెరకెక్కించడంతో ఈ సినిమా అప్పటి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఇప్పటికి శివ సినిమా ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి…ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరో ను కొట్టడానికి వచ్చిన కొంతమంది రౌడీలను హీరో కొట్టే ఒక ఫైట్ సిక్వెన్స్ ను చిత్రీకరించాల్సిన సమయం వచ్చిందట. దానికోసం వర్మ రాజు మాస్టర్ ను తీసుకున్నారట. సీన్ ఎలా ఉండాలి దాని పర్పస్ ఏంటి అనేది పర్ఫెక్ట్ గా చెప్పారట. అలాగే మీకు ఇంకేమైనా ఆడ్ చేయాలనిపిస్తే చేయండి అని వర్మ చెప్పాడట. దాంతో మాస్టర్ ఓకే అని నెక్స్ట్ డే కొన్ని టైర్లు తీసుకుని వచ్చాడట. లొకేషన్ కెళ్ళి చూస్తే లొకేషన్ మొత్తం చుట్టుపక్కల టైర్లు కనిపించాయట.
దాంతో వర్మ ఏం చేస్తున్నారు అని రాజు మాస్టర్ ని అడిగితే నాలుగు టైర్స్ కి ఫైర్ అంటించి హీరో చుట్టూరా తిప్పుతాము ఆ ఫైర్ లో నుంచి ఫోకస్ షిఫ్ట్ చేస్తే కొంతమంది రౌడీలు బండ్లు, జీప్ ల నుంచి దిగుతారు అంటూ తను కంపోజ్ చేసే ఫైట్ గురించి చెప్పారట. దాంతో వర్మ కోపానికి వచ్చి ఆ టైర్లని తీసేయండి…మీరు కావాలనుకుంటే ఈ ఫైట్ ని ఇంకో సినిమాలో పెట్టుకోండి కానీ నా సినిమాకి ఇది సెట్ అవ్వదని వర్మ చెప్పి రాజు మాస్టర్ ని పక్కకు తప్పుకోమని తనే ఆ ఫైట్ ని కంపోజ్ చేసుకున్నారట.
మొత్తానికైతే వర్మ రాజు మాస్టర్ ని అవమానించాడు అంటూ ఒక వార్త అప్పట్లో హాట్ టాపిగ్గా మారింది. ఎందుకంటే వర్మ కొత్త దర్శకుడు అప్పటికే రాజు మాస్టర్ దాదాపు 50 సినిమాలకు ఫైట్ మాస్టర్ గా చేశాడు చాలా ఫైట్లు కంపోజ్ చేసి ఉన్నాడు. అందులో చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాలకు సైతం ఆయన ఫైట్స్ కంపోజ్ చేశాడు.
అలాంటి వ్యక్తినే పక్కకు తప్పుకోమన్నాడంటే వర్మ చాలా పెద్ద తప్పు చేశాడు అంటూ అందరూ అనుకున్నారు. కానీ కట్ చేస్తే వర్మ షూట్ చేసిన ఫైట్ ఎక్స్ట్రాడినర్ గా వచ్చిందని సినిమా రిలీజ్ తర్వాత ఆ ఫైట్ గురించి చాలా బాగా మాట్లాడుకున్నారని చెప్పాడు. ఇక ఇప్పటికి శివ సినిమా టాపిక్ వచ్చిన ప్రతిసారి ఆ ఫైట్ ను గుర్తు చేసుకుంటూ ఉంటారట…