Shiva Re Release: 1989 వ సంవత్సరంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉలిక్కిపడేలా చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ…ఆయన చేసిన శివ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. 1989లో వచ్చిన ఈ సినిమాకి ఇప్పటికీ అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు…ఇక ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డివంగ, నాగార్జున ముగ్గురు కలిసి ఒక ఇంటర్వ్యూ ని కండక్ట్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ శివ సినిమా తాలూకు ఎక్స్పీరియన్స్ ని పంచుకునే ప్రయత్నం చేశాడు…ఈ సినిమాను చిత్రీకరిస్తున్నప్పుడు ఎవరికి ఈ సినిమా మీద నమ్మకం లేదని కేవలం నాగార్జున మాత్రమే తనని నమ్మాడని వర్మ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమంది దర్శకులు అతనికి పర్సనల్ గా కలిసి తనని దూషిస్తూ కొన్ని కామెంట్స్ చేశారట. ముఖ్యంగా ‘భాషా’ సినిమా దర్శకుడు ఆయన సురేష్ కృష్ణ డైరెక్ట్ గా రామ్ గోపాల్ వర్మాని కలిసి నాగార్జున అంత మంచి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇలాంటి సినిమా చేశావ్ అవకాశాన్ని వేస్ట్ చేసుకున్నావు. సినిమా అంత పెద్దగా ఏం లేదు అంటూ చెప్పారట.
ఆయన కామెంట్స్ చేయడానికి కారణం మొదటి రోజు ఈ సినిమా ఆయనతో పాటు చాలా. మందికి నచ్చలేదట. ఎందుకంటే అప్పటిదాకా మూస ధోరణిలో వెళ్తున్న సినిమాల తాలూకు ఇంపాక్ట్ జనాల మీద ఉంది. కాబట్టి ఈ సినిమా చాలా కొత్తగా ఉంది. అందువల్లే ప్రేక్షకుడు సైతం ఇది బావుందా బాలేదా అనే డైలమాలో పడి బాగుందని తెలుసుకోవడానికి రెండు మూడు రోజుల సమయం పట్టిందట…
ఈ విజయాన్ని వర్మ ఈ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక మరొక స్టార్ డైరెక్టర్ అయిన రవి రాజా పినిశెట్టి సైతం ఆర్జీవీ ఎదురుగానే మరొకరితో ఇలాంటి సినిమా తీసి దర్శకుల పరువు ఎందుకయ్యా తీస్తారు అంటూ వర్మ ను ఉద్దేశించి మాట్లాడాడట ఇక నాలుగు రోజులు గడిచిన తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళుతున్న క్రమంలో ఈ దర్శకులందరూ శివ సినిమాను చూసి సిగ్గుపడ్డారని ఆర్జీవీ చెబుతుండటం విశేషం…