spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ చేసిన ఆ సూపర్ హిట్ సినిమాను రీమేక్...

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ చేసిన ఆ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేస్తున్నా స్టార్ డైరెక్టర్…

Ram Gopal Varma: ‘శివ’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… అప్పటివరకు మూస ధోరణిలో వెళ్తున్న సినిమాలను కొత్త ట్రాక్ లోకి తీసుకొచ్చిన ఘనత కూడా తనకే దక్కుతుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగిన కెపాసిటి ఉన్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం… అలాంటి దర్శకుడు బాలీవుడ్ వెళ్లి అమితాబచ్చం తో సర్కార్, కంపెనీ లాంటి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. అలాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన వర్మ ఇప్పుడు పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. తన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన రంగీలా సినిమాను ఇప్పుడు తన పర్యవేక్షణలో రీమేక్ చేయాలని చూస్తున్నారు… తెలుగులో ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేసే క్రమంలో రంగీలా సినిమాని రీమేక్ చేయాలని చూస్తున్నారట. ఒకప్పుడు అమీర్ ఖాన్ చేసిన రంగీలా సినిమాని తెలుగులో ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసి రీమేక్ చేస్తే బాగుంటుందని ఆర్జీవీ భావిస్తున్నాడట.

Also Read: ప్రియుడి కోసం ఏకంగా తల్లినే.. వామ్మో ఇటువంటి కూతురు పుట్టనే కూడదు

ఇక మొత్తానికైతే ఈ సినిమాని ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి తెలుగులో రీమేక్ చేస్తారట. రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో అతని దగ్గర శిష్యరికం చేస్తున్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను ఈ మూవీ తో దర్శకుడిగా పరిచయం చేస్తున్నారట.

ఇక ఏది ఏమైనా కూడా రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలను చేశాడు. ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలు చేయడానికి కూడా పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. తనకు నచ్చిన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అవేవి వర్కౌట్ కావడం లేదు.

ఇక ఇప్పటికైనా ఆయన ఒకప్పటి ఫామ్ ని అందుకొని మంచి సినిమాలను చేస్తే బాగుంటుందని తన అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం కోరుకుంటున్నారు…మరి రంగీలా రీమేక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది తెలియాలంటే మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version