Ananya Birla IPL 2026: పోటీ హోరాహోరిగా ఉంటుంది. ఆటగాళ్ల మధ్య క్రీడా స్ఫూర్తి తార స్థాయికి చేరుకుంటుంది. బంతి బంతికి సమీకరణం మారిపోతూ ఉంటుంది. 20 ఓవర్లే గాని.. ప్రతి ఓవర్ కూడా హైవోల్టేజ్ లాగా సాగుతూ ఉంటుంది. అభిమానులకు టన్నులకొద్దీ ఆనందాన్ని అందిస్తూ ఉంటుంది. ఉత్సాహాన్ని జత చేస్తూ ఉంటుంది. దాదాపు 18 సంవత్సరాలుగా ఐపిఎల్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు దుమ్మురేపే ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది.
Also Read: ప్రియుడి కోసం ఏకంగా తల్లినే.. వామ్మో ఇటువంటి కూతురు పుట్టనే కూడదు
ఐపీఎల్ లో అన్ని జట్లు అభిమానులకు మినిమం ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటాయి. ఈ జాబితాలో హైదరాబాద్ జట్టుకు కాస్త ఎక్కువ స్థానం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే దక్కన్ చార్జెస్ నుంచి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న సన్రైజర్స్.. ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది.. దక్కన్ చార్జర్స్ జట్టు ఉన్నప్పుడు గాయత్రి రెడ్డి అభిమానులను విపరీతంగా అలరించేది. ఆమె కోసం ప్రత్యేకంగా అభిమానులు మైదానానికి వచ్చేవారంటే మామూలు విషయం కాదు.
దక్కన్ చార్జర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ గా రూపాంతరం చెందిన తర్వాత.. గాయత్రి రెడ్డి బాధ్యతను హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ భుజాల కు ఎత్తుకున్నారు. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కావ్య ఆకట్టుకుంటుంది. అందువల్లే ఆమెకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంతేకాదు ఆమె అభిమానులను అలరించడంలో ఏమాత్రం తగ్గరు. ఇప్పుడు హైదరాబాద్ జట్టు స్థాయిలోనే బెంగళూరు కూడా అభిమానులకు ఒక రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధమైంది.
కొద్దిరోజుల్లో ఐపీఎల్ ప్రారంభమవుతుంది అనుకుంటుండగా బెంగళూరు జట్టు వేరే వ్యక్తుల చేతిలోకి వెళ్లిపోయింది. దాదాపు 16 వేల కోట్లకు మించిన డీల్ సాగడంతో బెంగళూరు జట్టు ఆదిత్య బిర్లా కన్సర్షియం చేతిలోకి వెళ్లిపోయింది. బెంగళూరు సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆదిత్య కంపెనీ చైర్మన్ బిర్లా సోదరి అనన్య బిర్లా యాక్టివ్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె గనుక మైదానంలోకి వచ్చి ప్రేక్షకులకు అభివాదం చేస్తే అప్పుడు ఎంటర్టైన్మెంట్ పీక్స్ కు వెళ్తుంది. అంతేకాదు అభిమానులు ఆమెను చూసేందుకు మైదానాలకు వస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో అనన్య గురించి సోషల్ మీడియాలో విపరీతంగా సెర్చింగ్ సాగుతోంది. చూడాలి మరి ఈ సీజన్లో ఆమె ఏ స్థాయిలో అభిమానులను ఆకట్టుకుంటారో..
