Homeఎంటర్టైన్మెంట్Raakasa Movie Trailer Review: 'రాకాస' మూవీ ట్రైలర్ రివ్యూ : ఈమధ్య కాలం లో...

Raakasa Movie Trailer Review: ‘రాకాస’ మూవీ ట్రైలర్ రివ్యూ : ఈమధ్య కాలం లో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రాలేదు..

Raakasa Movie Trailer Review: ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి చిత్రాల్లో హీరోగా నటించి సూపర్ హిట్స్ ని అందుకొని యూత్ లో తన కామెడీ టైమింగ్ తో ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరో సంగీత్ శోభన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాకాస’ వచ్చే నెల ౩వ తేదీన విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న రెండవ చిత్రమిది. ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘కమిటీ కుర్రాళ్ళు’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈరోజు విడుదల చేసిన ట్రైలర్ ని చూస్తుంటే మరో హిట్ ఆమె ఖాతాలోకి వచ్చి చేరేలా అనిపిస్తోంది. ఇందులో హీరోయిన్ గా నయన్ సారికా నటించింది.

Also Read: ప్రియుడి కోసం ఏకంగా తల్లినే.. వామ్మో ఇటువంటి కూతురు పుట్టనే కూడదు

‘క’, ‘ఆయ్’, ‘విష్ణు విన్యాసం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఆమె హీరోయిన్ గా నటిస్తున్న చిత్రమిది. అదే విధంగా గెటప్ శ్రీను కూడా ఈ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత , ఈ సినిమా కథ విషయం లో ఒక అంచనా వేయాల్సి వస్తే, ఒక ఊరిలో ఒక రాక్షసుడు ఉంటాడు, అతనికి ప్రతీ రోజు బలి ఇవ్వాల్సిందే. పశువులు ఉంటే పశువులు, లేదంటే మనిషి , ప్రతీ రోజు ఇతనికి ఆహారం. అనుకోకుండా హీరో మరియు అతని గ్యాంగ్ కలిసి ఈ రాక్షసుడు ఉండే ప్రదేశానికి వెళ్తారు, అక్కడ జరిగిన సంఘటనల ఆధారంగానే ఈ సినిమాని తీసినట్టు తెలుస్తోంది. ట్రైలర్ ని చూస్తుంటే ఈ సినిమా నిర్మాణం లో క్వాలిటీ పరంగా నిర్మాత నిహారిక కొణిదెల ఎక్కడా తగ్గినట్టు అసలు అనిపించడం లేదు. VFX వర్క్ చాలా చక్కగా కుదిరింది. అదే విధంగా కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.

ఇలాంటి కథలతో ఈమధ్య కాలం లో ఒక్క సినిమా కూడా రాలేదు. సంక్రాంతి తర్వాత సరైన సినిమా రావడం లేదని బాధపడుతున్న ప్రేక్షకులకు , ఈ చిరం విందు భోజనం లాగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. సంగీత్ శోభన్ అంటే కచ్చితంగా అతని నుండి కామెడీ ని ఆశిస్తారు. ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత తన మార్క్ కామెడీ ఈ చిత్రం లో కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది . ముఖ్యంగా ట్రైలర్ చివర్లో సంగీత్ శోభన్ పలికిన డైలాగ్స్ చాలా ఫన్నీ గా అనిపించాయి. ఇక గెటప్ శ్రీను కూడా తన మార్క్ కామెడీ టైమింగ్ తో అదరగొట్టేసాడని తెలుస్తోంది. మరి సినిమాలో అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. సోషల్ మీడియా లో భారీ గా క్లిక్ అయినా ఈ ట్రైలర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి .

 

#RĀKĀSĀ Official Trailer | Sangeeth Shobhan, Nayan Sarika | Manasa | Niharika Konidela | Zee Studios

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version