Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) అనేక కేసుల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనపై ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) లపై గతంలో ఆయన మార్ఫింగ్స్ చేస్తూ సోషల్ మీడియా లో అసభ్యంగా పోస్టులు పెట్టినందుకు గాను ఆయనపై కేసు నమోదైంది. పోలీసులు ఈ కేసు లో అరెస్ట్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ వద్దకు వెళ్లారు కానీ, ఆ తర్వాత ఆయన హై కోర్టుకి వెళ్లి ముందస్తు బైలు తెచ్చుకోవడంతో ఆయన అరెస్ట్ ప్రస్తుతానికి ఆంధ్ర ప్రదేశ్ లో ఆగింది. కానీ చెక్ బౌన్స్(Cheque Bounce) కేసు లో మాత్రం రామ్ గోపాల్ వర్మ ని అరెస్ట్ కాకుండా ఎవ్వరూ ఆపేలా అనిపించడం లేదు. ఈ కేసు లో తప్పు ఒప్పుకొని లొంగిపోకుండా ఆయన తన శిక్షణను రద్దు చేయాలనీ పై కోర్టుకు వెళ్లి పిటీషన్ వేశాడు. ఆ కోర్టు నుండి రామ్ గోపాల్ వర్మ కి చుక్క ఎదురైంది. శిక్షను రద్దు చేసే అంశం పక్కన పెడితే, ఇప్పటి వరకు ఎందుకు లొంగిపోలేదంటూ ఫైర్ అయ్యింది. వెంటనే రామ్ గోపాల్ వర్మ ని అరెస్ట్ చేయాల్సిందిగా నాన్ బెయిలబుల్ వారెంట్ ని జారీ చేసి, బెయిల్ పిటీషన్ ని తిరస్కరించింది.
Also Read : రామ్ గోపాల్ వర్మ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మీద నెగెటివ్ కామెంట్స్ చేయడానికి కారణం అదేనా..?
కోర్టు లో లొంగిపోయిన తర్వాత బెయిల్ పిటీషన్ వేసుకోవచ్చని, అప్పుడు స్వీకరిస్తామని రామ్ గోపాల్ వర్మ కి నోటీసులు జారీ చేశారు. దీంతో రామ్ గోపాల్ వార కి ముంబై పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోవడం తప్ప మరో ఛాయస్ లేదు. అధికారికంగా కేవలం ఈ ఒక్క చెక్ బౌన్స్ కేసు మాత్రమే కాదు, బాలీవుడ్ లో ఆయన సినిమాల కోసం అనేక మంది దగ్గర ఫైనాన్స్ తీసుకొని,, వారికి తిరిగి డబ్బులు చెల్లించకుండా ముప్పు తిప్పలు పెట్టాడు. అందుకే ఇన్నేళ్లు ముంబై లో నివసించిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు అక్కడ దుకాణం సర్దేసి హైదరాబాద్ కి వచ్చాడని అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ముంబై కి రావడానికి ఆలోచిస్తున్నది అందుకే. పోలీసులకు లొంగిపోవడానికి ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదు, మొన్న ఒంగోలు పోలీసులకు 9 గంటల పాటు విచారణ చేసుకోవడానికి సహకరించాడు.
కానీ ముంబై కి వెళ్తే ఆయనకు ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు డబ్బులు సెటిల్మెంట్ చేసేవరకు ముంబై నుండి కదలనివ్వరు. దీంతో రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ముందు నొయ్యి, వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. చేసిన తప్పులకు ఎప్పుడైనా శిక్షలు అనుభవించాల్సిందే. అది ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే, చేసిన తప్పుల నుండి తప్పించుకోలేరు అనేది రాంగోపాల్ వర్మ ఉదంతం ఒక ఉదాహరణ. అయితే ముంబై లో ఎక్కడో ఆయనకు శిక్ష పడడం కాదు, మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా శిక్ష పడాలి అంటూ టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో బలవంతంగా డిమాండ్ చేస్తున్నారు.
Also Read : నా రూటే సపరేటు.. తగ్గేదేలే అంటూ బాలీవుడ్ పై వర్మ సంచలన వ్యాఖ్యలు