YS Vivekananda Reddy Case
YS Vivekananda Reddy Case: వైఎస్ వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య సంచలనం రేపింది. ఈ ఘటన జరిగి ఆరేళ్లు అవుతోంది. కానీ ఇంతవరకు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదు. కేసు కొలిక్కి తేవడంలో సిబిఐ విఫలం అయింది. 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. సిఐడి దర్యాప్తునకు నాటి సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే సిఐడి కాదు సిబిఐ దర్యాప్తు కావాలని పట్టుబడ్డారు నాటి విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సీబీఐ దర్యాప్తు అక్కర్లేదని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. దీనిని బట్టి గత ఐదేళ్లలో దర్యాప్తు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: కోర్టుకే మస్కా.. బోరుగడ్డ గ్రేట్ ఎస్కేప్!
* కొలిక్కిరాని కేసు
అయితే కేసు కొలిక్కి రాకపోగా.. ఈ ఐదేళ్లలో( 5 years) ఈ కేసులో ఐదుగురు సాక్షులు మాత్రం చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అది కూడా అనుమానాస్పదంగా చనిపోవడం సంచలనం రేకిత్తిస్తోంది. ఇలా సాక్షులు వరుసగా చనిపోతుండడంపై పోలీసులే షాక్ అవుతున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి కేసులో సాక్షుల మరణాలు విస్తు గొలుపుతున్నాయని స్వయంగా కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈ మరణాలపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్న ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. ఆయన వివేకానంద రెడ్డి ఇంటి వాచ్ మెన్. ముందుగా ఇది సాధారణ మరణం గానే అంతా భావించారు.. ఆయన భార్య అనుమానం వ్యక్తం చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
* వరుసగా సాక్షులు మృతి
వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి( Srinivasulu Reddy), గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, నారాయణ వేర్వేరు కారణాలతో చనిపోయారు. దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులోని ప్రధాన సాక్షుల మరణాలపై స్పందించిన కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.. వీరి మరణం వెనుక నిందితుల ప్రమేయం ఉందా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. ఐదేళ్లలో ఐదుగురు కీలక సాక్షులు మృతి చెందారని.. సాక్షులు ఏఏ కారణాలతో.. ఏ పరిస్థితుల్లో చనిపోయారో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
* వాంగ్మూలం సేకరించిన సిబిఐ
కాగా గత ఐదేళ్లలో ఈ సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించారు సిబిఐ( Central Bureau of Investigation ) అధికారులు. అయితే సిబిఐ అధికారుల తీరుతోనే సాక్షులు వరుసగా చనిపోతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో దీనిపై కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు ప్రకటించారు కడప జిల్లా ఎస్పీ. డీఎస్పీ ఆధ్వర్యంలో సాక్షుల మరణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేపడతామని చెప్పారు. సిబిఐ తీరితోనే మరణాలు సంభవించినట్లు వస్తున్న కామెంట్స్ పై కూడా విచారణ చేస్తామన్నారు.