https://oktelugu.com/

Ram Gopal Varma: మళ్లీ కెలికాడు.. ఈ కెలుకుడు ఇంకెన్నాళ్లు ?

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు వివాదానికి విడదీయరాని సంబంధం ఉంది. వివాదం వర్మకి నీడగా ఉంటుంది. ఆయన సినిమాలకు అదే ప్రధాన పెట్టుబడి. ఇక ఆయనకు వివాదమే ఎంటర్ టైన్మెంట్. అందుకే, ఈ సంచలన దర్శకుడు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు. పైగా తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పబ్లిసిటి చేస్తాడు. తాజాగా హిందీ ‘జెర్సీ’ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హిందీ జెర్సీలో ఒరిజినల్ సోల్ మిస్ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 26, 2022 / 05:01 PM IST
    Follow us on

    Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు వివాదానికి విడదీయరాని సంబంధం ఉంది. వివాదం వర్మకి నీడగా ఉంటుంది. ఆయన సినిమాలకు అదే ప్రధాన పెట్టుబడి. ఇక ఆయనకు వివాదమే ఎంటర్ టైన్మెంట్. అందుకే, ఈ సంచలన దర్శకుడు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు. పైగా తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పబ్లిసిటి చేస్తాడు. తాజాగా హిందీ ‘జెర్సీ’ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

    Ram Gopal Varma

    హిందీ జెర్సీలో ఒరిజినల్ సోల్ మిస్ అయిందనే విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. రామ్ గోపాల్ వర్మ ఏమి కామెంట్స్ చేశాడు అంటే.. ‘నానీ హీరోగా చేసిన ‘జెర్సీ’ సినిమాను బాలీవుడ్ లో డబ్ చేసి ఉంటే.. నిర్మాతలకు 10 లక్షలతో హిందీ వెర్షన్ రెడీ అయ్యేది. కానీ, హిందీలోకి ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు.

    Also Read: Sachin Tendulkar Daughter: హీరోయిన్ గా సచిన్ టెండూల్కర్ కూతురు.. తొలి సినిమా ఏ హీరోతోనో తెలుసా??

    ఇప్పుడు నిర్మాతలకు ఏకంగా రూ. 100 కోట్లు వరకూ నష్టం వచ్చింది. దీని వల్ల డబ్బు, సమయం, శ్రమ వృధా అన్నీ వేస్ట్ అయిపోయాయి. అదే హిందీలో ‘కెజీఎఫ్, పుష్ప, ఆర్.ఆర్.ఆర్’ లాంటి డబ్బింగ్ చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి. ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అయింది’. కానీ ‘జెర్సీ డెత్ ఆఫ్ రీమేక్స్’ అని హ్యాష్ ట్యాగ్ తో వర్మ పోస్ట్ చేశాడు. మొత్తానికి వర్మ ఈ సారి హిందీ జెర్సీ పై పడటం విశేషం.

    Ram Gopal Varma

    ఏది ఏమైనా వర్మ అందరి లాంటోడు కాదు. గతంలో వర్మ గురించి త్రివిక్రమ్ సినిమాలో ఒక డైలాగ్ ను ఉదాహరణగా చెప్పుకున్నాం. ఒక చెట్టు మీద మామిడి కాయ ఉంది. చెట్టు కింద ఒకడు దేనికోసమో వెతుకుతూ ఉంటాడు. పైన పండు వదిలేసి కింద వేరే దేని కోసమో వెతుకుతున్నాడు పిచ్చోడు అని అందరూ అనుకుంటారు. కానీ వాడు ఆ పండుని కొట్టడానికి రాయి కోసం వెతుకుతున్నాడు.

    కరెక్ట్ గా చెప్పుకుంటే ఇలాంటి పరిస్థితే ఆర్జీవీది కూడా. దారిన పోయే వారి కన్నా ఎంతో క్లారిటీ గా, ఫోకస్డ్ గా తనకు కావాల్సిన పని చేసుకుంటూ పోతున్నాడు ఆర్జీవీ. అంతేగాని, దారిన పోయే దానయ్యలను, లేక పని చేసుకునే పాపయ్యలను ఆర్జీవీ పట్టించుకోడు. ఏది ఏమైనా ఆర్జీవీ గత వైభవం తిరిగి రానట్టే. అయితే, ఆర్జీవీ సినిమాలు ప్లాప్ అవ్వొచ్చు, కానీ ఆర్జీవీ ఎప్పుడు సక్సెసే.

    Also Read: Mahesh Babu In Dubai: దుబాయి కి మహేష్ బాబు తో వెళ్లిన రాజమౌళి.. అభిమానులకు పూనకాలు రప్పించే వార్త

    Recommended Videos:

    Tags