https://oktelugu.com/

Mahesh Babu Rajamouli Went Dubai: దుబాయి కి మహేష్ బాబు తో వెళ్లిన రాజమౌళి.. అభిమానులకు పూనకాలు రప్పించే వార్త

Mahesh Babu Rajamouli Went Dubai: మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ కార్యక్రమాలను ఇటీవలే పూర్తి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ తో భారీ అంచనాలను ఏర్పర్చుకున్న ఈ సినిమా మే 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..భరత్ అనే నేను , మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరూ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 26, 2022 / 05:03 PM IST
    Follow us on

    Mahesh Babu Rajamouli Went Dubai: మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ కార్యక్రమాలను ఇటీవలే పూర్తి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ తో భారీ అంచనాలను ఏర్పర్చుకున్న ఈ సినిమా మే 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..భరత్ అనే నేను , మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరూ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న సూపర్ స్టార్..సర్కారు వారి పాట సినిమా తో బాక్స్ ఆఫీస్ వద్ద తన జైత్ర యాత్రని కొనసాగించడానికి సిద్ధం అవుతున్నాడు..ఇది ఇలా ఉండగా అభిమానులు ఎంతో కాలం నుండి తమ అభిమాన హీరో ని దర్శక ధీరుడు రాజమౌళి తో ఒక్క సినిమా చేస్తే చూడాలనే కోరిక తో ఎప్పటినుండో ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..వారి ఎదురు చూపులకు తెర దించుతూ తన తర్వాతి సినిమా మహేష్ బాబు తో ఉంటుంది అని రాజమౌళి అధికారిక ప్రకటన చేసి అభిమానులను కేరింతలు కొట్టేలా చేసాడు.

    Mahesh Babu Rajamouli Went Dubai

    అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఈ డ్రీం ప్రాజెక్ట్ అతి త్వరలోనే కార్య రూపం దాల్చనుంది ..ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా స్టోరీ ఫైనల్ డ్రాఫ్ట్ ని సిద్ధం చేసేసాడు అట రాజమౌళి..ఇప్పుడు ఈ స్టోరీ ని మహేష్ బాబు కి వినిపించడం కోసం దుబాయి కి పిలిచాడట..మొన్నటితో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ చేసుకొని ఫ్రీ అయిన మహేష్ బాబు, రాజమౌళి పిలుపు మేరకు నిన్న దుబాయి కి ప్రయాణం అయ్యాడు..దుబాయి కి మహేష్ బాబు వెళ్తున్న సమయం లో హైదరాబాద్ విమానాశ్రయం లో అభిమానులు తీసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..ఇది ఇలా ఉండగా #RRR మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే ముందు కూడా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లను దుబాయి కి పిలిపించి స్టోరీ డిస్కషన్స్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..అంతే కాకుండా వీళ్లిద్దరి లుక్స్ సినిమాలో ఎలా ఉండాలో కూడా అప్పట్లో టెస్ట్ షూట్ రాజమౌళి.

    Also Read: Balakrishna Another Surgery: బాలయ్య కి మరో సర్జరీ.. ఆందోళనలో ఫాన్స్

    ఇప్పుడు మహేష్ బాబు తో చెయ్యబోతున్న సినిమా కోసం కూడా స్టోరీ డిస్కషన్స్ జరిపి లుక్స్ కి సంబంధించిన టెస్ట్ షూట్స్ చెయ్యడానికే మహేష్ బాబు ని దుబాయి కి పిలిచినట్టు తెలుస్తుంది..వచ్చే ఏడాది లో ప్రారంభం కానున్న ఈ సినిమాని యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా రాజమౌళి తెరకెక్కించబోతున్నాడు అని గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తుంది..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ఒక్క ప్రెస్ మీట్ ద్వారా మీడియా కి అధికారికంగా తెలపబోతున్నారు అట..రాజమౌళి తన ప్రతి సినిమాకి షూటింగ్ ప్రారంభించుకునే ముందే స్టోరీ లైన్ చెప్పడం తన స్టైల్..ఈ సినిమాకి కూడా అదే చెయ్యబోతున్నాడు అట..సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా పూర్తి అయిన తర్వాత మధ్యలో గాప్ ఉంటె మరో సినిమా చెయ్యడానికి చూస్తున్నాడట మహేష్ బాబు..రాజమౌళి తో సినిమా ప్రారంభం అయ్యేలోపు సర్కారు వారి పాట సినిమా కాకుండా రెండు సినిమాలు విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడు మహేష్ బాబు.

    Also Read: AP Govt Schools: ‘భరత్ అనే నేను’.. మహేష్ లా.. సీఎం జగన్ సాధించాడు..

    Recommended Videos:

    Tags