https://oktelugu.com/

Sachin Tendulkar Daughter: హీరోయిన్ గా సచిన్ టెండూల్కర్ కూతురు.. తొలి సినిమా ఏ హీరోతోనో తెలుసా??

Sachin Tendulkar Daughter: మన ఇండియా లో చాలా మంది క్రికెట్ అభిమానులు సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత క్రికెట్ చూడడమే మానేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు..క్రికెట్ క్రీడా లో ఆయన లిఖించిన చరిత్ర అలాంటిది..సచిన్ ఇండియన్ టీం లో లేని లోటు ఎవ్వరు పూడవలేరు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..అభిమానులు ముద్దుగా ఈయనని క్రికెట్ గాడ్ అని పిలుచుకుంటారు..ఆయన కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా మంచి క్రికెటర్ ..ప్రస్తుతం ఆయన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 26, 2022 / 04:58 PM IST
    Follow us on

    Sachin Tendulkar Daughter: మన ఇండియా లో చాలా మంది క్రికెట్ అభిమానులు సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత క్రికెట్ చూడడమే మానేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు..క్రికెట్ క్రీడా లో ఆయన లిఖించిన చరిత్ర అలాంటిది..సచిన్ ఇండియన్ టీం లో లేని లోటు ఎవ్వరు పూడవలేరు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..అభిమానులు ముద్దుగా ఈయనని క్రికెట్ గాడ్ అని పిలుచుకుంటారు..ఆయన కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా మంచి క్రికెటర్ ..ప్రస్తుతం ఆయన IPL లో ముంబై ఇండియన్స్ టీం తరుపున బెంచ్ ప్లేయర్ గా కొనసాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..పూర్తి స్థాయి క్రికెటర్ గా అర్జున్ టెండూల్కర్ ఎప్పుడు ఇండియన్ టీం లోకి వస్తాడా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇది ఇలా ఉండగా సచిన్ టెండూల్కర్ కి సరా టెండూల్కర్ అనే కూతురు ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈమె గురించి ఇప్పుడు మీడియా లో ప్రచారం అవుతున్న ఒక్క వార్త అభిమానులకు పూనకాలు రప్పించేలా చేస్తుంది.

    Sachin Tendulkar Daughter Sara

    Also Read: Megastar Chiranjeevi: ఏమిటి ఐదు కథలా ? ఎప్పుడు చేస్తావ్ చిరు ?

    ఇక అసలు విషయానికి వస్తే సరా టెండూల్కర్ అతి త్వరలోనే బాలీవుడ్ లో హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేయనుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇప్పటికే పలు బాలీవుడ్ డైరెక్టర్లు మరియు నిర్మాతలు సరా టెండూల్కర్ డేట్స్ కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తుంది..కొన్నేళ్ల క్రితమే మోడలింగ్ రంగం లోకి అడుగుపెట్టిన సరా టెండూల్కర్ , ఒక్క టాప్ మోడల్ గా ప్రతి ఒక్కరికి సుపరిచితమే..అంతే కాకుండా సోషల్ మీడియా లో కూడా తనకి సంబంధించిన వర్కౌట్ వీడియోలు మరియు ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది..ఈమె అందచందాలు చూసి అభిమానులు ఈమె హీరోయిన్ గా బాలీవుడ్ లో అడుగుపెడితే తిరుగే ఉండదు అని అనుకున్నారు..వాళ్ళ కోరిక అతి త్వరలోనే నిజం అవ్వబోతుండడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది..త్వరలోనే తన మొదటి సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అధికారికంగా తెలియజెయ్యబోతుంది అట సరా టెండూల్కర్..మరి క్రికెట్ రంగం లో ఎవ్వరు అందుకోలేనంత ఎత్తుకి ఎదిగిన సచిన్ టెండూల్కర్ లాగ సరా టెండూల్కర్ తానూ ఎంచుకున్న సినీ రంగం లో అదే స్థాయికి ఎదుగుతుందో లేదో చూడాలి.

    Also Read: AP Govt Schools: ‘భరత్ అనే నేను’.. మహేష్ లా.. సీఎం జగన్ సాధించాడు..

    Recommended Videos:

    Tags