https://oktelugu.com/

Tollywood: ఏపీ ప్రభుత్వం అలా చేసి చూపించాలంటూ ఛాలెంజ్ చేస్తున్న ఆర్జీవి… దాని గురించేనా ?

Tollywood: టాలీవుడ్ లో ప్రస్తుతం ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా ఏపీ ప్రభుత్వానికి… సినీ ప్రముఖులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని… పెద్ద సినిమాలు దారుణంగా నష్టపోతాయంటూ ప్రొడ్యుసర్స్ వాపోతున్నారు. సినిమా టికెట్స్ ధరలను పెంచాలని వారు కోరుతున్నారు. అయితే అటు ఏపీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇక తాజాగా ఈ విషయమై వివాదాల దర్శకుడు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 4, 2022 / 04:00 PM IST
    Follow us on

    Tollywood: టాలీవుడ్ లో ప్రస్తుతం ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా ఏపీ ప్రభుత్వానికి… సినీ ప్రముఖులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని… పెద్ద సినిమాలు దారుణంగా నష్టపోతాయంటూ ప్రొడ్యుసర్స్ వాపోతున్నారు. సినిమా టికెట్స్ ధరలను పెంచాలని వారు కోరుతున్నారు. అయితే అటు ఏపీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇక తాజాగా ఈ విషయమై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. సినిమా టికెట్ల ధరల అంశంపై ఆర్జీవీ అడిగిన ప్రశ్నలు నెట్టింట వైరల్ గా మారాయి. ఒక టీవీ డిబేట్ లో ఆర్జీవీ అడిగిన ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయారు.

    Tollywood

    ఆ తర్వాత వోడ్కా తాగుతూ సోషల్ మీడియా వేదికగా మరో వీడియోను వర్మ రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏపీ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటికి ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరాడు. “నేను ప్రభుత్వాన్ని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను .. మానిఫ్రాక్చర్ కి, కన్జ్యూమర్ కి మధ్య ప్రభుత్వం ఎవరు..? రాజమౌళి బాహుబలి 50 కోట్లతో తీసాడు.. వర్మ ఐస్ క్రీమ్ 5 లక్షలతో తీసాడు.. రెండిటికి ఒకటే మూవీ రేట్ అంటే అది మొత్తం మార్కెట్ ని నాశనం చేస్తోంది.

    అయితే ఇదంతా ఎవరికోసం అంటే.. పేదవారి కోసమని ప్రభుత్వం అంటుంది. అయితే ఇవన్నీ కాకుండా.. టికెట్ రేట్స్ అలాగే ఉంచాలని అనుకుంటే.. మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వైఎస్ జగన్ మీరందరు కలిసి రాజమౌళి కన్నా మంచి సినిమా తీసి.. ఫ్రీగా రిలీజ్ చేయండి. మీకు అలాంటి కెపాసిటీ లేనప్పుడు.. మీకున్న పవర్ ని ఉపయోగించుకొని కెపాసిటీ ఉన్నవాళ్ళ ప్రతిభను తగ్గించడం రెడిక్యులస్ అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.

    Also Read: ఢీ మానేశాను కానీ అది మాత్రం మానను అంటున్న సుడిగాలి సుధీర్… అది ఏంటంటే ?