KCR: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. రెండు పార్టీల్లో విభేదాలు పెరిగాయి. దీంతో మాటల యుద్ధం నుంచి చేతల వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆదివారం బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317ను మార్చాలని చేసిన జనజారణ దీక్షకు అనుమతి లేదని ఆయనను అరెస్టు చేసి కోర్టుకు పంపింది. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జైలుకు వెళ్లి బండి సంయ్ ని పరామర్శించారు.

బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని సూచించినా కరోనా నిబంధనల మేరకు అనుమతి నిరాకరించారు. దీంతో సీఎం కేసీఆర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడినే టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నడ్డాను విమానాశ్రయం వద్దే అడ్డుకోనున్నట్లు సమాచారం.
Also Read: కోతల రాయుడు పెదరాయుడు అవుతాడా ?
దీంతో బండి సంజయ్ అరెస్ట్ రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేంద్రంలో అధికార పార్టీనే తన గుప్పిట్లో పెట్టుకోవాలని టీఆర్ఎస్ చూస్తోంది. ఇందుకుగాను అధికార పార్టీ కుట్రలు చేస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
అన్ని జిల్లా కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టాలని బీజేపీ భావించింది. అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలు ఎండగట్టే క్రమంలో నిరసనలు తెలిపేందుకు నిర్ణయించింది. బీజేపీని టార్గెట్ చేసుకుని తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ర్టవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి.
Also Read: అమెరికాలో ఒక్కరోజే పది లక్షల కరోనా కేసులా?