హీరోలంటే విరోధులుగా ఉంటారనే అపోహలు ప్రేక్షకుల్లో చాలానే ఉండేవి అప్పట్లో. మీడియా అంతగా విస్తరించకపోవడం.. సోషల్ మీడియా అందుబాటులో లేకపోవడంతో నిజమే అనుకునేవారు అందరూ. కానీ.. రానురానూ పరిస్థితి మారిపోయింది. సినీనటులు ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటున్నారో అభిమానులకు క్షణాల్లో తెలిసిపోతోంది.
Also Read: ట్రెండీ వీక్ః బట్టలు విప్పేసిన జాన్.. భయపడిపోయిన శ్రియ.. కంగనా హాట్ కామెంట్స్!
ఇక హీరోలు కూడా గతంలో రేర్ గా మీట్ అయ్యేవారు. కానీ.. ఇప్పుడు టోటల్ గా ఛేంజ్ వచ్చేసింది. ఒకరి సినిమా వేడుకల్లో మరొకరు పాల్గొనడం.. ఒకరి పార్టీలకు ఇంకొకరు హాజరవడం కామన్ గా మారిపోయింది. ఈ పరిణామం అభిమానులకు కూడా మంచి జోష్ ఇస్తోంది.
అయితే.. హీరోల సినిమా విషయాల గురించి పిన్ టూ పిన్ చెప్పగలిగే అభిమానులకు కూడా.. తమ అభిమాన హీరోల వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా తెలియదు. ఇప్పుడు మాత్రం ఎవరెవరు ఫ్రెండ్స్.. ఆ ఫ్రెండ్షిప్ ఎంత బలం అనేది కూడా తెలిసిపోతోంది. తాజాగా.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ హీరో శర్వానంద్ మధ్య స్నేహబంధం ఎంత బలంగా ఉందో ఫ్యాన్స్ తెలిసి వచ్చింది.
Thank you @AlwaysRamCharan for hosting a great party ❤️❤️❤️ pic.twitter.com/jJf03cRMp0
— Sharwanand (@ImSharwanand) March 6, 2021
వీరిద్దరూ చిన్ననాటి నుంచి ఫ్రెండ్స్. ఫ్యామిలీ దోస్తులు కూడా. సందర్భం వచ్చినప్పుడల్లా ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. లేటెస్ట్ గా అలాంటి సందర్భం వచ్చేసింది. ఇవాళ (మార్చి 6) శర్వానంద్ బర్త్ డే. ఈ శుభసందర్భంలో దోస్తులిద్దరూ ఒక్కచోట చేరారు. చెర్రీ స్వయంగా కేక్ పట్టుకొని శర్వాతో కట్ చేయించాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీరి ఫ్రెండ్షిప్ గురించి నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు.
Also Read: బాలయ్యతో దిల్ రాజు మూవీ.. డెరెక్టర్ అతనేనట..?!
ఇక, సినిమాల గురించి వస్తే.. శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’ మార్చి 11న రిలీజ్ కాబోతోంది. రామ్ చరణ్ అటు ఆచార్యలో తన షెడ్యూల్ మొత్తం ఫినిష్ చేశాడు. మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ లోకి అడుగు పెట్టనున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్