https://oktelugu.com/

Ram Charan-Prabhas : చైనాలో రామ్ చరణ్ కి ఇంత క్రేజ్ ఉందా..? ప్రభాస్ దగ్గర్లో కూడా లేడుగా..గ్లోబల్ స్టార్ టైటిల్ కి న్యాయం జరిగింది!

ఆడియన్స్ 'రంగస్థలం' చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు మన తెలుగు హీరోల్లో ప్రభాస్ నటించిన 'బాహుబలి' సిరీస్ మాత్రమే చైనా లో విడుదలైంది. రామ్ చరణ్ కి సంబంధించిన ఒక్క సినిమా కూడా చైనాలో విడుదల కాలేదు. అయినప్పటికీ కూడా ఆయనకి చైనా లో క్రేజ్ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 23, 2024 / 07:35 PM IST

    Ram Charan-Prabhas

    Follow us on

    Ram Charan-Prabhas : #RRR చిత్రం తర్వాత మెగా పవర్ రామ్ చరణ్ పేరు కాస్త గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గా మారిన సంగతి తెలిసిందే. ఇండియా లో ఎంతో మంది బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఉన్నారు. ఎప్పటి నుండో ఇండస్ట్రీ లో ఉన్నారు, ఎన్నో శిఖరాలను అధిరోహించారు. వాళ్ళెవ్వరూ కూడా ఇంత పెద్ద ట్యాగ్ ని పెట్టుకోలేదు, కానీ రామ్ చరణ్ అలాంటి ట్యాగ్ ని ఎలా పెట్టుకున్నాడు అంటూ సోషల్ మీడియా లో దీనిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కూడా నడిచాయి. కానీ #RRR చిత్రం తో రామ్ చరణ్ కి ఏ హీరోకి రానంత గ్లోబల్ వైడ్ రీచ్ వచ్చింది అనేది కాదు అనలేని వాస్తవం. టైటానిక్, అవతార్ వంటి అద్భుతాలను ఆవిష్కరించిన జేమ్స్ కెమరూన్ వంటి దిగ్గజాలు కూడా #RRR చిత్రం లో రామ్ చరణ్ పాత్ర గురించి ప్రత్యేకించి మాట్లాడాడు అంటే, ఆయన రీచ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

    అంతే కాదు 2018 వ సంవత్సరం లో విడుదలైన రామ్ చరణ్ సూపర్ హిట్ చిత్రం రంగస్థలం ని జపాన్ లో భారీ రేంజ్ లో #RRR చిత్రం తర్వాత విడుదల చేసారు. రెస్పాన్స్ సెన్సషనల్ గా వచ్చింది. #RRR చిత్రానికి మొదటి వీకెండ్ లో 44 జపనీస్ మిలియన్ డాలర్ల వసూళ్లు రాగా, రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రానికి 25 జపనీస్ మిలియన్ డాలర్లు వచ్చాయి. కొత్త సినిమాలకు ఈ రేంజ్ వసూళ్లు రావడం మన పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ కి సహజమే. కానీ ఎప్పుడో ఆరేళ్ళ క్రితం విడుదలైన సినిమాని, మళ్ళీ విడుదల చేస్తే ఈ ఇలాంటి వసూళ్లు రావడం ఇదే తొలిసారి. జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 ఇండియన్ మూవీస్ లో రంగస్థలం చిత్రం కూడా ఉంది. కేవలం జపాన్ లో మాత్రమే కాదు, రామ్ చరణ్ చైనా లో కూడా మంచి క్రేజ్ ఉంది.

    అక్కడి ఆడియన్స్ ‘రంగస్థలం’ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు మన తెలుగు హీరోల్లో ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సిరీస్ మాత్రమే చైనా లో విడుదలైంది. రామ్ చరణ్ కి సంబంధించిన ఒక్క సినిమా కూడా చైనాలో విడుదల కాలేదు. అయినప్పటికీ కూడా ఆయనకి చైనా లో క్రేజ్ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రీసెంట్ గా చైనా కి సంబంధించిన బాక్స్ ఆఫీస్ టికెట్ సేల్స్ పోర్టల్ లో రామ్ చరణ్ కి సంబంధించిన ప్రొఫైల్ ని అత్యధిక చైనీయులు అనుసరిస్తున్నారు. ఆయన తర్వాతి స్థానంలో ప్రభాస్ ఉన్నాడు. చైనా లో ఒక్క సినిమా కూడా విడుదల చేయకుండా ప్రభాస్ ని మించిన పాపులారిటీ ని సంపాదించాడంటే, రామ్ చరణ్ ని గ్లోబల్ స్టార్ అని ఎందుకు పిలవకూడదో మీరే చెప్పండి. త్వరలో ఆయన నటించిన #RRR చిత్రం చైనా లో భారీగా విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఎలా ఉంటుందో చూడాలి.