https://oktelugu.com/

Allu Arjun : హీరోగా పనికి రాడు అన్నారు..కట్ చేస్తే పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులకు మొగుడయ్యాడు…

కృషి ఉంటే సాధ్యం కానీ పని ఏది లేదు. చేయాలనే సంకల్పం ఉంటే నెరవేరని కార్యం లేదు. గెలవాలనే తపన ఉంటే ఓటమి కూడా ఓడిపోక తప్పదు.నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలనే పట్టుదల ఉంటే నువ్వు వేసే అడుగే నిన్ను విజయ తీరాలకు చేర్చుతుంది...అలాంటి ఎన్నో అడుగులు వేస్తూ తనని చూసి ఛీ కొట్టిన వాళ్ల చేతే విజిల్స్ కొట్టించిన ఏకైక హీరో అల్లు అర్జున్...

Written By:
  • Gopi
  • , Updated On : November 23, 2024 / 07:46 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్లని వాళ్లు ప్రూవ్ చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. నిజానికి చాలామంది హీరోలు వాళ్ళకి వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటూ కొన్ని సినిమాలు సక్సెస్ అయిన తర్వాత వాళ్లు రిలాక్స్ అయిపోయి కథల ఎంపికలో చాలావరకు మిస్టేక్స్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ల కెరియర్ అనేది మధ్యలోనే ఫేడౌట్ దశకి చేరుకుంటుంది. కానీ కొంత మంది హీరోలు మాత్రం మొదటి సినిమా సమయంలో ఎంత కసిగా ఉన్నారో ఇప్పుడు చేస్తున్న సినిమాలతో కూడా అంతేకసిగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో ‘అల్లు అర్జున్’ ఒకరు…ఇక ‘గంగోత్రి ‘ సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మొదటి సినిమా సక్సెస్ అయినప్పటికి అల్లు అర్జున్ మాత్రం చాలా వరకు ఎదురుదెబ్బలను తిన్నాడు. అతను హీరోగా పనికిరాడు అంటూ చాలామంది అతన్ని విమర్శించారు. అయినప్పటికి తను ఎక్కడ కూడా డిప్రెషన్ లోకి వెళ్లకుండా తనను తాను మార్చుకోవడానికి ఏం చేయాలి అనే దాని మీదనే ఎక్కువ కసరత్తులను చేస్తూ ఆర్య సినిమా కోసం యూత్ ఫుల్ గెటప్ లోకి మారిపోయాడు. ఇక ఈ సినిమాతో యూత్ ఐకాన్ గా కూడా మారిపోయి తనదైన రీతిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక కాలక్రమేణ స్టైలిష్ స్టార్ గా గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా ఎవరైతే తనని విమర్శించారో వాళ్ళ చేతే శభాష్ అనిపించుకున్నాడు. ఇక అప్పటి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం ‘పుష్ప ‘ సినిమా వరకు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ వస్తుంది. ఒక సినిమా కోసం ఆయన విపరీతంగా కష్టపడతాడు ఇక ఆ కష్టమే అతన్ని ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మార్చింది. ఇక దాంతో పాటుగా ‘నేషనల్ అవార్డు’ విన్నర్ గా కూడా మార్చింది. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కానీ ‘నేషనల్ అవార్డు’ ని తను అందుకొని తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాడనే చెప్పాలి… దర్శకులు చెప్పిన కథలను విని దానికి తగ్గట్టుగా తన బాడీని మార్చుకుంటూ తన క్యారెక్టరైజేషన్ లో వేరియేషన్స్ ను చూపిస్తూ వస్తున్న అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోల్లో ఒకడిగా ఎదిగాడు.

    ఇక ‘పుష్ప 2’ సినిమాతో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయన ఈ సినిమాతో ఒక భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు. అలాగే ఈ సినిమాతో 1500 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న తెలుగు హీరోగా చరిత్ర సృష్టిస్తాడు. ఇక మొత్తానికైతే ప్రస్తుతం అల్లు అర్జున్ పేరు పాన్ ఇండియా వైడ్ గా వినిపిస్తుంది.

    ఆయన పేరుకి భారీ క్రేజ్ అయితే దక్కింది. ఇక పుష్ప 2 సినిమా 1000 కోట్లకు పైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది అంటే కేవలం అది అల్లు అర్జున్ మేనియా అనే చెప్పాలి. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలందరూ రాజమౌళితో సినిమాలను చేసిన తర్వాత స్టార్ హీరోలుగా మారితే ఇప్పటివరకు రాజమౌళితో ఒక్క సినిమా చేయకపోయిన కూడా అల్లు అర్జున్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదిగిన వైనం చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన దగ్గరికి వచ్చిన కథకి న్యాయం చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతాడు.

    సినిమా హిట్ అయితే పొంగిపోకుండా, ఫ్లాప్ అయితే కృంగిపోకుండా ఆ సినిమాకోసం ఆయన 100% ఎఫర్ట్ పెట్టాడా లేదా అనే దాని మీదనే ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. అందువల్లే ఈరోజు ఆయన ఈ పొజిషన్లో ఉన్నాడని చెప్పాలి. ఇక పుష్ప 2 సినిమా ఖ్యాతిని పెంచడమే కాకుండా ఆల్ టైం ఇండియన్ సినిమాల్లో ఈ సినిమా నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఇప్పటికే ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…