Pushpa 2: The Rule First Review : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప 2 : ది రూల్’ వచ్చే నెల 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మేనియా ఇప్పుడు మామూలు రేంజ్ లో లేదు. థియేట్రికల్ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి అప్పటి వరకు ఉన్న అంచనాలు పదింతలు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ పలికిన ‘వైల్డ్ ఫైర్’ అనే డైలాగ్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. మీమర్స్ ప్రతీ సందర్భంలోనూ ఈ డైలాగ్ ని తెగ వాడేస్తున్నారు. అల్లు అర్జున్ క్యారక్టర్ ని పార్ట్ 1 లో ఎంత పవర్ ఫుల్ గా, యాటిట్యూడ్ తో డైరెక్టర్ సుకుమార్ చూపించాడో, పార్ట్ 2 అంతకు రెండింతలు పవర్ ఫుల్ గా చూపించినట్టు థియేట్రికల్ ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, సెంటిమెంట్, ఎమోషన్స్ కూడా చాలా బలంగా పెట్టినట్టు ట్రైలర్ ని చూసినప్పుడు ఆడియన్స్ కి అనిపించింది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ ఇప్పటికే సిద్ధమైపోయింది అట. డైరెక్టర్ సుకుమార్ ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన రషస్ మొత్తాన్ని చూసి ఎంతో సంతృప్తి చెండాడట. ప్రతీ సన్నివేశం ఆయన అనుకున్న దానికంటే అద్భుతంగా వచ్చిందట. పుష్ప పార్ట్ 1 లో హీరో ఎలా రైజ్ అయ్యాడు అనే దానిని చూపించాడు. పుష్ప రైజింగ్ లో ఉన్నప్పుడే అంత యాటిట్యూడ్ తో ఉన్నాడంటే, ఇక రూలింగ్ లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటాడో మీరు ఇప్పటికే ఊహించుకొని ఉండుంటారు. అయితే సినిమా ఔట్పుట్ మీ ఊహలకు మించి ఉంటుందట. సెకండ్ హాఫ్ కూడా ఎలివేషన్స్ తో పాటు, ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం సెకండ్ హాఫ్ కి సంబంధించిన రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంది.
ఒక సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టించాలంటే, యాక్షన్ తో పాటు, సినిమాలో ఉన్న ఎమోషన్స్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి. అలా అయితేనే ‘బాహుబలి 2’ ‘కేజీఎఫ్ 2’ లాంటి బాక్స్ ఆఫీస్ సునామీలు వస్తాయి. ‘పుష్ప 2’ లో వాటికి మించి ఉండబోతుందట. ప్రతీ పది నిమిషాలకు ఫ్యాన్స్, ఆడియన్స్ కి గూస్ బంప్స్ అనుభూతి కలిగే ఎన్నో సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయట. ఇక బాక్స్ ఆఫీస్ జాతర ఎలా ఉండబోతుందో మీరే ఊహించుకోండి. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్ల రూపాయలకు జరిగింది. బాక్స్ ఆఫీస్ టార్గెట్ 2000 కోట్లు. కానీ ఈ చిత్రం గురించి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న ఈ రివ్యూ నిజమైతే 3000 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరో 12 రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతుందో చూద్దాం.