https://oktelugu.com/

Game Changer : బుక్ మై షో’ యాప్ లో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ప్రభంజనం..విడుదల రోజు ఏ రేంజ్ లో ఉంటుందో!

కానీ 'గేమ్ చేంజర్' 3D లో విడుదల అవ్వబోతుందా లేదా అనేది చూడాలి. ఇదంతా పక్కన పెడితే గేమ్ చేంజర్ కి సంబంధించిన మూడవ పాట ఈ నెల 28వ తారీఖున విడుదల కాబోతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2024 / 08:01 PM IST
    Follow us on

    గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు టీజర్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో రామ్ చరణ్ లుక్స్ లో ఉన్న వేరియేషన్స్ ని చూసి, రంగస్థలం తర్వాత ఆయనకీ నటుడిగా నిరూపించుకునే మరో అద్భుతమైన స్కోప్ దొరికినట్టుగా అనిపించింది. వచ్చే నెలలో పూర్తి స్థాయి ప్రొమోషన్స్ ని ప్రారంభించుకోనున్న ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ఇప్పటి నుండే ప్లానింగ్ మొదలైంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా నార్త్ ఇండియా, ఓవర్సీస్ లో కూడా అనేక ఈవెంట్స్ ని గ్రాండ్ గా జరిపించాలని చూస్తున్నారు మేకర్స్. వచ్చే నెల మూడవ వారం లో థియేట్రికల్ ట్రైలర్ ని కూడా వదలబోతున్నారు.

    ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం బుక్ మై షో ఆన్లైన్ టికెట్ సేల్స్ పోర్టల్ యాప్ లో సంచలనం సృష్టించింది. విడుదలకు ముందు ప్రతీ సినిమాకి ఎంత మంది ఆసక్తి చూపిస్తున్నారో నెంబర్ కౌంట్ తో సహా చూపిస్తుంది బుక్ మై షో యాప్. అలా గేమ్ చేంజర్ చిత్రం విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ కూడా అప్పుడే 2 లక్షల 5 వేల మంది ఈ సినిమాని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రోజులు పెరిగే కొద్దీ ఈ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సినిమా విడుదల సమయానికి 1 మిలియన్ మార్కుని దాటేస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. మరోపక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ ని చూసేందుకు 9 లక్షల మందికి పైగా ఎదురు చూస్తున్నట్టు బుక్ మై షో యాప్ లో కనిపిస్తుంది. వచ్చే నెల 5 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి ఓవరాల్ గా 1.5 మిలియన్ మార్కుని దాటే అవకాశం ఉంది.

    మరి ‘గేమ్ చేంజర్’ చిత్రానికి కూడా ఆ రేంజ్ ఇంట్రెస్ట్స్ వస్తాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ఈ రెండు సినిమాల కోసం కేవలం అభిమానులు, ప్రేక్షకులు మాత్రమే కాదు, ట్రేడ్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలకు బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉంది. అయితే ‘గేమ్ చేంజర్’ కి ‘పుష్ప 2’ మధ్య ఉన్న తేడా ఏమిటంటే, ‘పుష్ప 2’ చిత్రం 3D లో కూడా విడుదల కాబోతుంది. కానీ ‘గేమ్ చేంజర్’ 3D లో విడుదల అవ్వబోతుందా లేదా అనేది చూడాలి. ఇదంతా పక్కన పెడితే గేమ్ చేంజర్ కి సంబంధించిన మూడవ పాట ఈ నెల 28వ తారీఖున విడుదల కాబోతుంది.