https://oktelugu.com/

pawan kalyan og : గేమ్ చేంజర్’,’దేవర’ చిత్రాలను అవలీలగా దాటేసిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’..కేవలం ఆ ఒక్క ప్రాంతంలోనే 100 కోట్లు!

తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 140 కోట్ల రూపాయలకు జరిగినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో 'గేమ్ చేంజర్' మీద 'ఓజీ ' బిజినెస్ ఎక్కువకి జరిగింది కానీ, ఓవరాల్ గా మాత్రం 'గేమ్ చేంజర్' చిత్రానికి కాస్త ఎడ్జ్ ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2024 / 08:08 PM IST
    Follow us on

    pawan kalyan og : తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంత మంది పాన్ ఇండియన్ హీరోలు వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా అని విశ్లేషకులు సైతం అంటూ ఉంటారు. క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వంటి పదాలు పవన్ కళ్యాణ్ వల్లనే ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గా ఉన్నాడు. ఇంతకు ముందు ఆయనకు ఉన్న క్రేజ్ కంటే, ఉప ముఖ్యమంత్రి అయ్యాక క్రేజ్ పదింతలు ఎక్కువ అయ్యింది. ఇలాంటి సమయంలో ఆయన నుండి ఒక్క సినిమా విడుదలైతే బాగుంటుంది అని అభిమానులు చాలా కోరుకుంటున్నారు. అయితే మార్చి 27 వ తారీఖున పవన్ కళ్యాణ్ నుండి ‘హరి హర వీరమల్లు’ లేదా ‘ఓజీ’, ఈ రెండు చిత్రాల్లో ఎదో ఒకటి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏది ముందు రాబోతుంది అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

    ఈ రెండు సినిమాల నిర్మాతలు మార్చి 27వ తేదీ పై కన్ను వేశారు. ఎవ్వరూ కూడా తగ్గడం లేదు. కానీ ఓజీ చిత్రానికి జెట్ స్పీడ్ లో బిజినెస్ జరుగుతుంది. ఇప్పటికే నిర్మాత DVV దానయ్య దాదాపుగా 90 శాతం ప్రాంతాలకు ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ రేటు కి అమ్మేశాడు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్(కోస్తాంధ్ర + రాయలసీమ) ప్రాంతానికే 100 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. కోస్తాంధ్ర (నెల్లూరు+కృష్ణ + గుంటూరు+ ఉత్తరాంధ్ర+ఈస్ట్+ వెస్ట్) కలిపి 75 కోట్ల రూపాయలకు ఈ చిత్రం అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ఇది సాధారణమైన విషయం కాదు. అదే విధంగా రాయలసీమ ప్రాంతంలో 23 నుండి 25 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఓవరాల్ ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనే 100 కోట్ల రూపాయిల రేషియో లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

    అదే విధంగా నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి 50 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రాంత థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లోనే 150 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం, కర్ణాటక లో 12 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. అదే విధంగా తమిళనాడు , రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ ఇలా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 220 కోట్ల రూపాయలకు పైగా జరిగిందట. మరో పక్క ఎన్టీఆర్ దేవర చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, అన్ని భాషలకు కలిపి 180 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది. అలాగే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 140 కోట్ల రూపాయలకు జరిగినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ చేంజర్’ మీద ‘ఓజీ ‘ బిజినెస్ ఎక్కువకి జరిగింది కానీ, ఓవరాల్ గా మాత్రం ‘గేమ్ చేంజర్’ చిత్రానికి కాస్త ఎడ్జ్ ఉంది.