https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి ఆ సినిమాలను చేసి పెద్ద తప్పు చేశాడా..?

మెగాస్టార్ చిరంజీవి దాదాపు 45 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఆయన ప్లేస్ ను రీప్లేస్ చేసే హీరో ఇండస్ట్రీలో ఎవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు చిరంజీవికి పోటీని ఇవ్వాలనే ప్రయత్నం చేసినప్పటికి ఆయన మాత్రం యంగ్ హీరోలతో పోటీ పడుతూ తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 24, 2024 / 08:00 PM IST
    Follow us on

    Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఈ ఏజ్ లో కూడా వరుస సినిమాలు చేయడమే కాకుండా యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు ఆయన కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనే హోప్ అయితే అందరిలో ఉండేది. ఇక డిస్ట్రిబ్యూటర్లు చిరంజీవి సినిమాతో భారీగా డబ్బులను సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో ఉండేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. కమర్షియల్ సినిమాల కంటే ప్రయోగాత్మకమైన సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కాబట్టి చిరంజీవి సైతం ప్రయోగాత్మకమైన సినిమాలని ఎంచుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి కెరియర్లో కొన్ని సినిమాలు అనవసరంగా చేశాడని అతని అభిమానులు చాలావరకు అభిప్రాయపడుతూ ఉంటారు. అందులో రుద్రవీణ సినిమా ఒకటి కాగా, మరొకటి బిగ్ బాస్…ఇక రుద్రవీణ సినిమాకి నేషనల్ అవార్డు అయితే వచ్చింది. కానీ చిరంజీవికి కమర్షియల్ గా సక్సెస్ అయితే రాలేకపోయింది. అప్పట్లో చిరంజీవి కమర్షియల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడు. తన నుంచి ఒక సినిమా వస్తుందంటే మినిమం గ్యారంటీ వసూళ్లను రాబడుతుందనే ఒక పేరైతే ఉండేది. కానీ రుద్రవీణ సినిమాకి పెద్దగా డబ్బులు అయితే రాలేదు. ఇక ఈ సినిమాకి నాగబాబు ప్రొడ్యూసర్ కావడంతో కొంతవరకు నష్టాలు కూడా వచ్చాయి.

    మరి ఇలాంటి సినిమాలను చిరంజీవి చేయకపోయి ఉంటే బాగుండేదని తద్వారా చిరంజీవి స్టార్ డమ్ అయితే కొంతవరకు తగ్గిందని కొంతమంది సినిమా పెద్దలు సైతం చెబుతూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి ఆ సినిమాను ఒక ప్రయోగాత్మకమైన సినిమాగా నిలపాలనే ప్రయత్నం చేసినప్పటికి అవార్డుల పరంగా ఈ సినిమా వర్కౌట్ అయింది.

    కానీ సక్సెస్ పరంగా మాత్రం అంత పెద్ద ఇంపాక్ట్ ను చూపించలేదనే చెప్పాలి. ఇక కమర్షియల్ సినిమా దర్శకుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ బాపునీడు దర్శకత్వంలో చేసిన ‘బిగ్ బాస్’ సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. చిరంజీవి ఎంటైర్ కెరియర్ లో ఇదొక భారీ డిజాస్టర్ అనే చెప్పాలి.

    ఇక ఈ సినిమాని కూడా చిరంజీవి చేయకపోయి ఉంటే బాగుండేదని అప్పట్లో తన అభిమానులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేశారు. ఇక మొత్తానికైతే చిరంజీవి హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా ఇప్పటివరకు భారీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు…