https://oktelugu.com/

Prabhas : ప్రభాస్ కి నిజంగానే ఈ ఇద్దరు హీరోయిన్లతో ఎఫైర్ ఉందా..? అందుకే పెళ్లి చేసుకోవడం లేదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు ఉన్నప్పటికి ఇక్కడ కొంతమందికి మాత్రమే చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంటుంది అందులో ప్రభాస్ ఒకరు... ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం..

Written By:
  • Gopi
  • , Updated On : January 5, 2025 / 04:33 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్… ఈశ్వర్ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న ఈయన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈయన చేస్తున్న సినిమాలు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి…ఇక ఇప్పటికి 44 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏంటి అంటూ తమ అభిమానులు చాలా రకాలుగా సోషల్ మీడియాలో కామెంట్లైతే పెడుతున్నారు. నిజానికి ప్రభాస్ కి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనట్టుగా ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లేకపోతే ఎప్పటికప్పుడు ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కొన్ని వార్తలు వచ్చినప్పటికి వాటిలో ఎంత మాత్రం నిజం లేదు అంటూ ఎప్పటికప్పుడు ఆయన క్లారిటీ అయితే ఇస్తూ వస్తున్నాడు. మరి ప్రభాస్ పెళ్లి అంటూ గత కొన్ని సంవత్సరాలుగా ఒక రచ్చ అయితే నడుస్తుంది. ఇక ఈమధ్య ఆ పెళ్లిగోల అనే మ్యాటర్ అయితే చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పాలి.

    అయితే ప్రభాస్ ఇంతకుముందు తన సినిమాల్లో హీరోయిన్లుగా చేసిన ఇద్దరు భామలతో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఇక ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదని ఆ ఇద్దరు హీరోయిన్లు కూడా అలాగే ఉండిపోయారంటు ఈ మధ్య కొన్ని వార్తలు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి…

    ఇక ప్రభాస్ కెరియర్ స్టార్టింగ్ లో ఆ హీరోయిన్ తో వరుసగా సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక మరొకరు ఎవరు అంటే ఇండస్ట్రీలో దాదాపు 20 సంవత్సరాలకు పైన ఉండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలతో నటించి మెప్పించిన ఒక సీనియర్ హీరోయిన్ తో ఆయనకి ఎఫైర్ ఉందని వార్తలైతే వస్తున్నాయి. ఈ ఆమె ప్రభాస్ తో కూడా పలు సినిమాల్లో నటించి భారీ సక్సెస్ లను అందుకుంది…మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఎలాంటి వార్తలైతే రావడం లేదు.

    ఇక వీళ్ళిద్దరిలోనే ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చినప్పటికి అవి కూడా వాస్తవం కాదు అంటూ ఎప్పటికప్పుడు తన సన్నిహిత వర్గాల నుంచి క్లారిటీ అయితే ఇస్తూ వస్తున్నారు. మరి వీళ్లను కాకుండా మిగతా ఇంకెవరినైనా సరే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా ఆయనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…