Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ తనయుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్… తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు… ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా అవతారం ఎత్తిన ఆయన తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన ఈ హీరో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో మరొకసారి స్టార్ హీరోగా అవతారం ఎత్తడానికి సిద్ధమవుతున్నాడు… ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి వచ్చిన రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్టు కొట్టిన ఏకైక హీరోగా రామ్ చరణ్ చరిత్రను సృష్టించాడు. ఇక అప్పుడే ఆయన వరుసగా మంచి సినిమాలను ఎంచుకొని సూపర్ సక్సెస్ లను సాధించినట్లైతే రామ్ చరణ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగేవాడు. కానీ అలా చేయకుండా ఆయన రొటీన్ రొట్ట ఫార్ములాలో సాగే సినిమాలను మాత్రమే చేసుకుంటూ రావడం వల్ల ఆయనకు సక్సెసులు అయితే దక్కాయి.
కానీ నటుడిగా ఆయన అంత బాగా ఎలివేట్ కాలేకపోయాడు. ఇక ఎప్పుడైతే ‘రంగస్థలం’ సినిమా వచ్చిందో అప్పటినుంచి నటుడు గానే కాకుండా ఆయన తనకంటు ఒక ఓన్ స్టైల్ లో ఎదిగే ప్రయత్నం చేశాడు. ఆయన సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆయనకు భారీ స్టార్ డమ్ కూడా దక్కింది.
ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుతున్న ఈ స్టార్ హీరో నెంబర్ వన్ హీరోగా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. వరుసగా మంచి సక్సెస్ లను సాధించాలి. అలాగే వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తూ కలెక్షన్లను రప్పించగలిగే కెపాసిటీ ఉండాలి. మరి అలాంటి సక్సెస్ లను సాధించగలిగే కెపాసిటీ రామ్ చరణ్ కి అయితే ఉంది.
కానీ ఆయన దాన్ని ఏ విధంగా వాడుకుంటాడనే విషయాలకు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉన్నాయి… తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక అలాగే పాన్ ఇండియాలో కూడా ఈ ఫ్యామిలీని పరిచయం చేసి అక్కడ కూడా వీళ్ళందరూ స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. మరి వీళ్ళు అక్కడ సక్సెస్ సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…