Game Changer Teaser : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ టీజర్ కాసేపటి క్రితమే విడుదలై ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. రామ్ చరణ్ అభిమానులను, శంకర్ అభిమానులను పూర్తిగా సంతృప్తి పరుస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ఈ టీజర్ ని చూస్తే అర్థం అవుతుంది. ఇందులో రామ్ చరణ్ రాజకీయ నాయకుడిగా, స్టూడెంట్ గా, ఎలక్షన్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఆ మూడు పాత్రలకు సంబంధించిన షాట్స్ ని మనం టీజర్ లో గమనించే ఉంటాము. అయితే టీజర్ లో మీరెవ్వరు గమనించని కొన్ని ఆసక్తికరమైన షాట్స్ ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ హీరో శ్రీకాంత్ లుక్ ని ఎవరైనా గమనించారా..?, బట్ట తలతో ముసలివాడిలాగా ఉన్నటువంటి ఆయన లుక్స్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చాక్లెట్ బాయ్ లాగా కనిపించే శ్రీకాంత్ ని ఇలాంటి లుక్స్ లో చూపించాలి అనే ఆలోచన డైరెక్టర్ శంకర్ కి ఎలా వచ్చిందో అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
అదే విధంగా కమెడియన్ సునీల్ లుక్ కూడా చూస్తేనే నవ్వు వచ్చేలా ఉంది. ఒకప్పుడు సునీల్ కామెడీ ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డైలాగ్స్ కూడా పలకకుండా కేవలం తన లుక్స్ తోనే నవ్వు రప్పించేవాడు. ఈ టీజర్ లో సునీల్ లుక్ ని చూస్తే వింటేజ్ సునీల్ మార్క్ గుర్తుకొచ్చింది. టీజర్ లో మీరెవ్వరు గమ్మనించని మరో షాట్ ఏమిటంటే, రామ్ చరణ్ నీళ్ల లోపల కూర్చొని అరవడం. ఇది సినిమాలో ఏ సందర్భంలో వస్తుందో తెలియదు కానీ, వింటేజ్ శంకర్ యాంగిల్ ఇందులో కనిపించింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటే శంకర్ మార్క్ అనిపించలేదు. అదే విధంగా శంకర్ నుండి ఒక సినిమా వస్తుందంటే, కచ్చితంగా ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటారు. గేమ్ చేంజర్ లో ఆ కొత్తదనం మిస్ అయ్యింది. ఒక మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమా టీజర్ ని చూసిన అనుభూతి కలిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇరగకుమ్మేస్తాడని అర్థమైపోయింది, కానీ పాన్ ఇండియా లెవెల్ లో క్లిక్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు అందరిలో సందేహం కలుగుతుంది.
ఇదంతా పక్కన పెడితే శంకర్ సినిమాల్లో సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటి వరకు ఆడియన్స్ ఎక్కడా చూడని లొకేషన్స్ ని చూపిస్తూ థ్రిల్ చేస్తుంటాడు. ‘గేమ్ చేంజర్’ లో కూడా అలాంటి సాంగ్స్ ఎంచుకున్నాడని టీజర్ లో చూస్తే అర్థం అవుతుంది. ఈ టీజర్ ని చూసిన తర్వాత అర్థం చేసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే రామ్ చరణ్ క్యారక్టర్ ఇందులో హైలైట్ గా ఉండబోతుంది అని. ఈ సినిమాలో ఆయనకీ మితిమీరిన కోపం ఉంటుందని తెలుస్తుంది. దాని వల్ల ఎదురయ్యే సందర్భాలను డైరెక్టర్ శంకర్ పర్ఫెక్ట్ గా తీస్తే వేరే లెవెల్ లో ఉంటుంది. మొత్తం మీద ‘గేమ్ చేంజర్’ చిత్రం శంకర్ ‘శివాజీ’ తరహా పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా. ఎమోషన్స్ సరిగ్గా కుదిరితే సంక్రాంతికి ఆడియన్స్ థియేటర్స్ కి ఒక జాతర లాగా కదులుతారు.