Ram Charan with Johnny Master: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం చేస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం ఆయనకు బాగా కలిసొచ్చిన రూరల్ బ్యాక్ డ్రాప్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండడమే. గతం లో రామ్ చరణ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీసినప్పుడు ‘రంగస్థలం’ లాంటి సంచలనం వచ్చింది. నటుడిగా కూడా రామ్ చరణ్ కి తిరుగులేని పేరు తీసుకొచ్చింది. ‘పెద్ది’ కూడా అలాంటి పేరు తీసుకొస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్. ఎందుకంటే స్టోరీ లైన్ అలాంటిది మరీ. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జప్రుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వచ్చే నెలలో ఈ చిత్రం నుండి మొదటి లిరికల్ వీడియో సాంగ్ కూడా రిలీజ్ కాబోతుంది.
ఈ చిత్రానికి AR రెహ్మాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అంతా బాగానే ఉంది కానీ, ఈ చిత్రం లోని అత్యధిక పాటలకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. రామ్ చరణ్ ప్రతీ సినిమాకు జానీ మాస్టర్ పని చేస్తున్నాడు కదా, ఈ సినిమాకు పని చేయడం లో వింతేమీ ఉంది అని మీరు అనుకోవచ్చు. ఒకప్పుడు పని చేయడం వేరు, ఇప్పుడు పని చేయడం వేరు. ఎందుకంటే జానీ మాస్టర్ పై ప్రస్తుతం దారుణమైన అభియోగం ఉంది. ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ శ్రేష్టి వర్మ జానీ మాస్టర్ తనని అత్యాచారం చేసేందుకు ప్రయత్నం చేసాడని, నన్ను టార్చర్ చేస్తున్నాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో జానీ మాస్టర్ ని నెల రోజుల పాటు పోలీసులు రిమాండ్ లో తీసుకున్నారు. ఈ కేసు లో జానీ మాస్టర్ నిర్దోషి గా ఇంకా బయటపడలేదు.
అంతకు ముందు జనసేన పార్టీ లో క్రియాశీలక పాత్రలో కొనసాగిన జానీ మాస్టర్ ని పవన్ కళ్యాణ్ నిజనిర్ధారణ నిరూపణ అయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిందిగా ఆదేశించాడు. ఆయన్ని ఇంకా పార్టీ లోకి కూడా చేర్చుకోలేదు. కానీ నిర్దోషి గా నిరూపణ అవ్వని జానీ మాస్టర్ రామ్ చరణ్ తన సినిమాకు పిలిచి మరీ కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇవ్వడం పై ఇండస్ట్రీ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది కరెక్ట్ కాదు అంటూ రామ్ చరణ్ ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ఎన్నో ఏళ్ళ నుండి పరిచయం ఉన్న జానీ మాస్టర్ ఎలాంటివాడో నాకు ఒక క్లారిటీ ఉందని, ఆయన ఎలాంటి తప్పు చేయలేదని బలంగా నమ్మాడు కాబట్టే జానీ మాస్టర్ కి అవకాశం ఇచ్చాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఒకవేళ తప్పు చేయకపోతే జానీ మాస్టర్ పై కేసు ఉండేది కాదు కదా అని సోషల్ మీడియా లో యాంటీ ఫ్యాన్స్ నుండి ఎదురు అవుతున్న ప్రశ్న.