Bizarre German case: ఈ వార్త రాస్తుంటే కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇది జరిగిందా? లేదా? కొందరు గాసిప్ రాయుళ్ళు కావాలని పుట్టించారా? లేదా కల్పించారా? అనే అనుమానం వచ్చింది. ఆ తర్వాత అనేక మాధ్యమాలను పరిశీలించి.. అందులో ఉన్న విషయాలను చదివిన తర్వాత.. ఇదంతా నిజమే అనుకొని ఒక అంగీకారానికి వచ్చి.. ఇది రాయాల్సి వచ్చింది. వాస్తవానికి ఇదంతా కూడా పెద్దలు చదవాల్సిన కంటెంట్. కాకపోతే దాన్ని సాధ్యమైనంత వరకు ట్రిమ్ చేసి రాయాల్సి వచ్చింది.
ప్రపంచ ఆటోమొబైల్ రాజధానిగా జర్మనీ దేశానికి పేరు ఉంది. ఈ దేశం యూరప్ ఖండంలో ఉంటుంది కాబట్టి.. ఇక్కడ అలవాట్లు విచిత్రంగా ఉంటాయి. వెస్ట్రన్ కల్చర్ ఇక్కడ అడుగడుగునా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. ప్రధాన మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జర్మనీలో డెమోట్రియస్ సౌపోలోస్ అనే 27 సంవత్సరాల యువకుడు వున్నాడు. ఇతడికి గతంలోని వివాహం జరిగింది.. వివాహం జరిగి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ వారికి సంతాన భాగ్యం కలగలేదు. దీంతో అతడు అనేక ఆసుపత్రులు తిరిగాడు. భారీగానే ఖర్చు పెట్టాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు.
సౌపోలోస్ కు పక్కింట్లో 34 సంవత్సరాల వ్యక్తి ఉండేవాడు. అతడు చూసేందుకు ఆరడుగుల ఎత్తు.. అంతకుమించిన అందంతో ఉండేవాడు. దీంతో సౌపోలోస్ కు ఒక ఆలోచన వచ్చింది. పిల్లలులేని తమకు అతడి ద్వారా సంతాన భాగ్యం సొంతం చేసుకోవాలని అనిపించింది. ఇందులో భాగంగానే అతడు సౌపోలోస్ ను సంప్రదించాడు. తన భార్యను గర్భవతిని చేయాలని కోరాడు. దీనికి మొదట్లో ఆ వ్యక్తి ఒప్పుకోలేదు. ఆ తర్వాత సౌపోలోస్ అనేకమార్లు బతిమిలాడటంతో పక్కింటి వ్యక్తి ఒప్పుకున్నాడు. దీంతో వారానికి మూడుసార్లు సౌపోలోస్ తన భార్యను పక్కింటి వ్యక్తి వద్దకు తీసుకెళ్లేవాడు.
సౌపోలోస్ భార్యతో పక్కింటి వ్యక్తి వారానికి మూడుసార్లు లైంగిక కలయికలో పాల్గొనేవాడు. ఇలా 72 సార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె గర్భవతి కాలేదు.. చివరికి పక్కింటి వ్యక్తికి సౌపోలోస్ పరీక్ష చేయించాడు. అయితే అతడికి వ్యంధత్వం ఉందని తేలింది. దీంతో అతని మీద సౌపోలోస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టు దాకా కూడా వెళ్లాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.