KA Movie First Review: కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ మొట్టమొదటి రివ్యూ..సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్టుల మీద ట్విస్టులు!

ఏడాదికి మూడు సినిమాలు చేసే కిరణ్ అబ్బవరం, కాస్త గ్యాప్ ఇచ్చి సరైన కథతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ దీపావళి కి ఆయన హీరోగా నటించిన 'క' చిత్రం విడుదల కాబోతుంది.

Written By: Vicky, Updated On : October 25, 2024 4:57 pm

KA Movie First Review

Follow us on

KA Movie: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించిన యంగ్ హీరోలలో ఒకరు కిరణ్ అబ్బవరం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన తొలి సినిమా ‘రాజా వారు..రాణి వారు’ చిత్రంతోనే ప్రేక్షకులను అలరించాడు. ఇక ఆ తర్వాత ‘SR కల్యాణ మండపం’ చిత్రం తో తొలి కమర్షియల్ హిట్ ని అందుకున్నాడు. ఎవరీ కుర్రాడు చాలా చలాకి గా ఉన్నాడే, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ కూడా విభిన్నంగా ఉంది అని ప్రత్యేకంగా ఇతని గురించి సోషల్ మీడియా లో మాట్లాడుకున్నారు. అలా మొదలైన కిరణ్ అబ్బవరం సినీ ప్రస్థానం, ‘సమ్మతమే’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి సూపర్ హిట్స్ తో యూత్ ఆడియన్స్ కి చేరువ అయ్యింది. అయితే ఈమధ్య కాలం లో ఆయనకి వరుస ఫ్లాప్స్ రావడంతో మార్కెట్ బాగా డౌన్ అయ్యింది.

ఏడాదికి మూడు సినిమాలు చేసే కిరణ్ అబ్బవరం, కాస్త గ్యాప్ ఇచ్చి సరైన కథతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ దీపావళి కి ఆయన హీరోగా నటించిన ‘క’ చిత్రం విడుదల కాబోతుంది. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. ఈ సినిమాకి సుజిత్ మద్దెల, సందీప్ మద్దెల అనే ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహించారు. వీళ్లిద్దరికీ ఇది తొలి సినిమానే, కానీ మంచి టాలెంట్ ఉన్న కుర్రాళ్ళు అని ఈరోజు విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ని చూస్తే అర్థం అయ్యింది. మంచి మిస్టరీ థ్రిల్లర్ లాగ అనిపించిన చిత్రాన్ని చింత గోపాలకృష్ణ నిర్మించాడు. అయితే ఈ సినిమాని ఇటీవలే ప్రముఖ నిర్మాత నాగ వంశీ మరియు పలువురు ముఖ్యమైన బయ్యర్స్, మీడియా ప్రతినిధులకు ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారు. నిర్మాత నాగవంశీ కి ఈ చిత్రం తెగ నచ్చేసింది. అందుకే ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేసాడు. రీసెంట్ గానే ఆయన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని కూడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

భారీ లెవెల్ లో రిలీజ్ చేసి ఆల్ టైం రికార్డు వసూళ్లను దక్కించుకున్నాడు. ఆ జోష్ లో ఈ చిత్రాన్ని కూడా కొనేసాడు. ఈ సినిమాలో హీరో పోస్ట్ మ్యాన్ గా నటించాడని టీజర్, ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. అతని ఊరిలో జరిగే కొన్ని అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకునే హీరో పాత్రలో ఆయన ఇందులో కనిపించాడు. ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యే స్క్రీన్ ప్లేతో సరికొత్త అనుభూతి ని కల్పించాడట. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే నాలుగు ట్విస్టులను చూస్తే ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమా రీ రికార్డింగ్ కూడా అద్భుతంగా కుదిరిందట. కేవలం థియేటర్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అనుభూతి చెందడానికి రిపీట్స్ లో చూస్తారట. మరి నిజంగా ఆ రేంజ్ లో సినిమా ఉందా లేదా అనేది తెలియాలంటే 31వ తేదీ వరకు ఆగాల్సిందే.